'ది ప్యారడైజ్' టీమ్‌ది అతి నమ్మకమా?
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆర్టిస్ట్‌ల ఎంపిక విషయంలో హాట్ టాపిక్‌గా మారింది. అణచివేతకు గురైన ఓ వర్గానికి చెందిన తల్లీ కొడుకుల కథగా ఇది రూపొందుతోంది.
By: Tupaki Entertainment Desk | 22 Dec 2025 4:00 PM ISTటాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన క్రేజీ మూవీ `ది ప్యారడైజ్`. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. `దసరా` వంటి మాస్ బ్లాక్ బస్టర్ తరువాత మరోసారి వీరిద్దరు కలసి `ది ప్యారడైజ్`తో మ్యాజిక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. `దసరా`లో హీరో నానిని మాసీవ్ అవతార్‌లో చూపించయి షాక్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల `ది ప్యారడైజ్`తో మరో అడుగేసి నానిని డిఫరెంట్ గెటప్‌లో చూపిస్తూ షాక్ ఇవ్వబోతున్నాడు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, అందులో నాని రెండు జెడలు, ముక్కు పోగులతో కనిపించిన తీరు పలువురిని షాక్‌కు గురి చేయడమే కాకుండా సినిమాపై అంచనాల్ని పెంచేసింది. 1980లో సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ రెడ్ లైట్ ఏరియాలో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథగా దీన్ని రూపొందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆర్టిస్ట్‌ల ఎంపిక విషయంలో హాట్ టాపిక్‌గా మారింది. అణచివేతకు గురైన ఓ వర్గానికి చెందిన తల్లీ కొడుకుల కథగా ఇది రూపొందుతోంది.
తన తల్లి పంతం కోసం కొడుకు ఎలాంటి యుద్ధం చేశాడనే పాయింట్ ఇందులో కీలకం. గ్లింప్స్‌లోనే కథ, దాని నేపథ్యాన్ని పరిచయం చేసిన శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ క్యారెక్టర్స్ కోసం ఎంచుకున్న నటీనటులు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నారు. ఇందులోని పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌లో కలెక్షన్‌కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. శికంజ మాలిక్ క్యారెక్టర్‌లో కరుడుగట్టిన విలన్‌గా ఆయయ పాత్ర ఉంటుందని ఆ మధ్య విడుదల చేసిన మోహన్‌బాబు లుక్‌తో స్పష్టం చేశారు మేకర్స్.
ఇంత వరకు కీర్తిసురేష్, మృణాల్ ఠాకూర్, శ్రీనిధిశెట్టి, ప్రియాంక అరుళ్ మోహన్, సాయిపల్లవి, రష్మిక మందన్న వంటి క్రేజీ హీరోయిన్‌లతో కలిసి నటించిన నాని `ది ప్యారడైజ్` మూవీ విషయంలో మాత్రం భిన్నంగా అడుగులు వేస్తున్నాడు. ఇందులో నానికి జోడీగా `డ్రాగన్` మూవీతో పాపులారిటీని సొంతం చేసుకున్న కయదు లోహర్ నటిస్తోంది. ఇటీవలే సైలెంట్‌గా సెట్‌లోకి ఎంటరైన కయదు సైలెంట్‌గా షూటింగ్ చేస్తోంది. ఇక మిగతా పాత్రల్లో బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `కిల్` ఫేమ్ రాఘవ్ జుయల్, సొనాలి కులకర్ణి, తనికెళ్ళ భరణితో పాటు సంపూర్ణేష్‌బాబు కూడా నటిస్తున్నాడు.
కమెడీ పేరడీ సినిమాలతో పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ తొలిసారి ఈ మూవీలో బిర్యానీ పేరుతో సాగే సీనియర్ క్యారెక్టర్‌లో నటిస్తుండటం అందరిని షాక్‌కు గురి చేస్తోంది. రీసెంట్‌గా విడుదల చేసిన సంపూ లుక్ చర్చనీయాంశంగా మారింది. గతంలో బ్రహ్మానందం, వెన్నెలకిషోర్ సీరియస్ రోల్స్‌లో నటించారే కానీ సక్సెస్ కాలేకపోయారు. అనగనగ ఒక రోజు (నెల్లూరు పెద్దారెడ్డి ఉరాఫ్ జాక్సన్), మనీ (ఖాన్ దాదా) సినిమాలు తప్ప బ్రహ్మానందం సీరియస్ రోల్స్ చేసిన సినిమాలేవీ సక్సెస్ కాలేదు.
ఇప్పుడు కామెడీ, పారడీ సినిమాలతో పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబుని ఇందులో సీరియస్ క్యారెక్టర్‌లో చూపించే ప్రయత్నం చేస్తుండటంతో `ది ప్యారడైజ్` టీమ్‌ది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అని అంతా అవాక్కవుతున్నారు. రెగ్యులర్ కాస్టింగ్ ఫార్మెట్‌కి పూర్తి భిన్నంగా క్యారెక్టర్‌ల ఎంపిక పూర్తి చేస్తున్న ఈ టీమ్ మ్యాజిక్ చేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని మార్చి 26, 2026లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
