'ది ప్యారడైజ్' బాక్సాఫీస్.. వీకెండ్ రికవరీ ఎంతంటే..
టాక్ తో సంబంధం లేకుండా మాస్ సెంటర్లలో ఓపెనింగ్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు.
By: M Prashanth | 28 Sept 2026 10:45 AM ISTదసరా లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అనగానే ట్రేడ్ లో ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోయాయి. భారీ బిజినెస్ తో థియేటర్లలోకి వచ్చిన 'ది ప్యారడైజ్' ఫస్ట్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. టాక్ తో సంబంధం లేకుండా మాస్ సెంటర్లలో ఓపెనింగ్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు.
మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో ఓదెల టేకింగ్ మరోసారి వర్కౌట్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో క్యారెక్టర్లు, ఆ పొలిటికల్ కనెక్షన్ లకు బి, సి సెంటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఇంపాక్ట్ తోనే కలెక్షన్ల పరంగా సినిమా బ్రేక్ ఈవెన్ కు చాలా దగ్గరగా వచ్చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే మెజారిటీ ఏరియాల్లో బయ్యర్లు సేఫ్ జోన్ కు చేరుకున్నారు.
ఇక పక్క రాష్ట్రాల్లో నాని మార్కెట్ స్టెడీగా పెరుగుతోందని ఈ వీకెండ్ వసూళ్లు ప్రూవ్ చేస్తున్నాయి. కర్ణాటకలో మొదటి వీకెండ్ కే పది కోట్లు దాటేయడం విశేషం . హిందీలో పెద్దగా హడావిడి ప్రమోషన్స్ చేయకపోయినా.. కంటెంట్ అక్కడ కనెక్ట్ అవ్వడంతో ఆశ్చర్యకరంగా డీసెంట్ నంబర్స్ నమోదు కావడం ట్రేడ్ కు కొంత సర్ ప్రైజింగ్ గానే ఉంది.
పెట్టుబడిలో ఇప్పటికే ఎనభై శాతం రికవరీ పూర్తి కావడంతో సినిమా క్లీన్ హిట్ స్టేటస్ వైపు అడుగులు వేస్తోంది. అంచనాల ప్రకారం 'ది ప్యారడైజ్' మొదటి నాలుగు రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఈ విధంగా ఉంది.
• వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.155 కోట్లు+
• 80% రికవరీ
• కర్ణాటకలో రూ.10 కోట్లు+
• తమిళ్, హిందీ మార్కెట్లలోనూ మంచి వసూళ్లు
• హిందీ నెట్ రూ.7.20 కోట్లు+
వీకెండ్ వరకు ఒక లెక్క అయితే, వర్కింగ్ డేస్ లో మరో లెక్క ఉంటుంది. సోమవారం వచ్చే కలెక్షన్ల డ్రాప్స్ ఏ రేంజ్ లో ఉంటాయనే దాన్ని బట్టే ఈ సినిమా ఫైనల్ రన్ డిసైడ్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో 20 శాతం మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో, వీక్ డేస్ లో వచ్చే కలెక్షన్లు బయ్యర్లకు ప్రాఫిట్స్ తీసుకురావడంలో చాలా కీలకం కానున్నాయి.
ఇక బుధవారం నుంచే బాక్సాఫీస్ ఈక్వేషన్స్ మారిపోతాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతికి 'అనకాపల్లి', 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' లాంటి డిఫరెంట్ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఆ రెండు సినిమాల కంటెంట్ క్లిక్ అయితే థియేటర్ల కౌంట్ గట్టిగానే అవసరం కాబట్టి, ప్యారడైజ్ స్క్రీన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. ఆలోపే ఆ మిగిలిన టార్గెట్ ఫినిష్ చేస్తే నాని అకౌంట్ లో సేఫ్ కమర్షియల్ హిట్ పడినట్లే.
