Begin typing your search above and press return to search.

ఆ లుక్స్ తోనే గూస్‌బంప్స్ వ‌చ్చాయి

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న కొత్త సినిమా ది ప్యార‌డైజ్. హిట్3 త‌ర్వాత నాని చేస్తున్న ది ప్యార‌డైజ్ కు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 Nov 2025 2:08 PM IST
ఆ లుక్స్ తోనే గూస్‌బంప్స్ వ‌చ్చాయి
X

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న కొత్త సినిమా ది ప్యార‌డైజ్. హిట్3 త‌ర్వాత నాని చేస్తున్న ది ప్యార‌డైజ్ కు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌స‌రా సినిమాతో ఫ‌స్ట్ అటెంప్ట్ తోనే మంచి హిట్ ను ఖాతాలో వేసుకోవ‌డంతో పాటూ ఆ సినిమాతో నాని త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని కూడా నిల‌బెట్టుకున్నారు శ్రీకాంత్. ఆ న‌మ్మ‌కంతోనే ఇప్పుడు నాని మ‌రోసారి శ్రీకాంత్ కు ఛాన్స్ ఇచ్చారు.

ది ప్యార‌డైజ్ రా స్టేట్‌మెంట్స్ కు భారీ రెస్పాన్స్

ద‌స‌రా సినిమా త‌ర్వాత నాని- శ్రీకాంత్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ది ప్యారడైజ్ పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాలకు ఏ మాత్రం త‌గ్గ‌కుండా శ్రీకాంత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ని ఆల్రెడీ రిలీజైన గ్లింప్స్ తోనే క్లారిటీ వ‌చ్చింది. ది ప్యార‌డైజ్ నుంచి రా స్టేట్‌మెంట్ పేరుతో వ‌చ్చిన గ్లింప్స్ కు ఆడియ‌న్స్ నుంచి ఏ స్థాయి రెస్పాన్స్ వ‌చ్చిందో కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపించ‌నున్న నాని

ద‌స‌రాతో నానిని మాస్ హీరోగా ప్రెజెంట్ చేసిన శ్రీకాంత్ ఈసారి ది ప్యార‌డైజ్ ఇంకా కొత్త‌గా ప్రెజెంట్ చేయ‌నున్నార‌ని లుక్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ఇదిలా ఉంటే ది ప్యార‌డైజ్ మూవీ గురించి ద‌స‌రా సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన దీక్షిత్ శెట్టి రీసెంట్ గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను రీసెంట్ గా ది ప్యార‌డైజ్ సెట్స్ కు వెళ్లాన‌ని దీక్షిత్ చెప్పారు.

ద‌స‌రా కంటే భారీగా..

ది ప్యార‌డైజ్ కోసం వేసిన సెట్, ఆ సెట‌ప్ నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయ‌ని, ది ప్యార‌డైజ్ తెలుగు సినిమాకు గేమ్ ఛేంజ‌ర్ అవుతుంద‌ని, షూటింగ్ టైమ్ లో నాని లుక్ చూశాక త‌నకు గూస్‌బంప్స్ వ‌చ్చాయ‌ని, ది ప్యార‌డైజ్ మూవీ ద‌స‌రా సినిమా కంటే చాలా భారీగా ఉండ‌బోతుంద‌ని చెప్పారు. వ‌చ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానున్న ది ప్యార‌డైజ్ లో మోహ‌న్ బాబు, రాఘ‌వ్ జుయ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నుండ‌గా, అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.