Begin typing your search above and press return to search.

'ప్యారడైజ్' లో బాబు మోహన్ నటించాడా? ఆయన క్యారెక్టర్ ఏంటి? ఫైనల్ గా సినిమాలో ఎందుకు లేదు...వైరల్ న్యూస్

రోజురోజుకి ఈ సినిమాకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఏదేమైనా కూడా నాని ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి.

By:  Gopi Velupala   |   27 Sept 2026 9:00 PM IST
ప్యారడైజ్ లో బాబు మోహన్ నటించాడా? ఆయన క్యారెక్టర్ ఏంటి? ఫైనల్ గా సినిమాలో ఎందుకు లేదు...వైరల్ న్యూస్
X

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్యారడైజ్' సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం తో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబడుతుంది. రోజురోజుకి ఈ సినిమాకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఏదేమైనా కూడా నాని ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. నాని లాంటి స్టార్ హీరో కి భారీ రేంజ్ లో ఓపెనింగ్ ను తీసుకొచ్చి పెట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం... ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఒకప్పటి స్టార్ కమెడియన్ అయిన 'బాబు మోహన్' కూడా ఇందులో నటిస్తున్నట్టుగా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. కానీ తీరా స్క్రీన్ మీద చూస్తే మాత్రం బాబు మోహన్ కి సంబంధించిన ఒక్క సీన్ కూడా ఈ సినిమాలో లేదు. నిజానికి ఆయన ఈ సినిమాలో నటించాడా? లేదంటే సెలెక్ట్ అయిన తర్వాతే అతని క్యారెక్టర్ ని పక్కన పెట్టేశారా? ఒకవేళ ఆయన నటించిన తర్వాత సినిమా ఫ్లో కి ఆ సీన్స్ ఏమైనా అడ్డుగా ఉంటే ఫైనల్ గా ఎడిట్ టేబుల్ మీద ఆయన సీన్స్ ను తీసేసారా? అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న...

నిజానికి ఈ సినిమా కోసం బాబు మోహన్ లుక్ టెస్ట్ లో పాల్గొన్నాడు లుక్ కూడా ఫైనల్ అయింది. అలాగే మీరు ఏ లుక్ లో అయినా సరే సెట్ అయిపోతారు సార్ అంటూ దర్శకుడి నుంచి ఆయన ఒక కాంప్లిమెంట్ ను కూడా పొందారట. ఇదంతా బాబు మోహన్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. బాబూ మోహన్ కి లుక్ టెస్ట్ చేశారు కానీ సినిమాకు సంబంధించిన షూట్ లో తను ఎప్పుడు పాల్గొనలేదట. లుక్ ఫైనల్ అయిపోయిన తర్వాత సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ను తీసేసినట్టుగా కూడా తెలుస్తుంది. కారణం ఏంటంటే సినిమా ని కొంచెం బెటర్మెంట్ చేసి రైటప్ చేశారట.

అందువల్ల కొన్ని క్యారెక్టర్స్ ఎగిరిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే బాబు మోహన్ ఇంటర్వ్యూ ఇచ్చే సమయానికి తను సినిమాకు సంబంధించిన లుక్ టెస్టులో పాల్గొన్నాడు. కానీ సినిమా షూటింగ్లో ఇంకా పాల్గొనలేదు అంటూ ఆయనే ఆ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికైతే ఈ సినిమాలో బాబు మోహన్ ఉంటే ఒక వైబ్ క్రియేట్ అయ్యేది. ఒకప్పుడు తన నవ్వులతో అందర్నీ ఎంటర్ టైన్ చేసిన బాబు మోహన్ ఈ సినిమాలో ఉంటే కనక ప్రేక్షకుడికి ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేదని కొంతమంది విమర్శకులు భావిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్యారడైజ్ మూవీకి రోజురోజుకి కలెక్షన్స్ అయితే పెరుగుతుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి...