Begin typing your search above and press return to search.

నాని కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ హిట్.. ఆయా షేర్ హిస్టరీ!

ఈ సాంగ్ లో నాని కనిపించిన రగ్గడ్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జ‌డ‌ల్ అనే పాత్రలో ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   8 April 2026 12:40 PM IST
నాని కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ హిట్.. ఆయా షేర్ హిస్టరీ!
X

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా సినిమా ది ప్యార‌డైజ్ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ ఆయా షేర్ రిలీజైన కొద్ది రోజుల్లోనే అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ పాట 100 మిలియన్ వ్యూస్‌ను అత్యంత వేగంగా చేరుకోవడం ద్వారా నాని కెరీర్‌లో కొత్త మైలురాయిగా నిలిచింది. గతంలో నాని సినిమాలకు వచ్చిన సాంగ్స్ కంటే ఈ సాంగ్ అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించడం విశేషం.




మాస్ లో పెరిగిన నాని ఇమేజ్

ఈ సాంగ్ లో నాని కనిపించిన రగ్గడ్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జ‌డ‌ల్ అనే పాత్రలో ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, నాని మాస్ ఇమేజ్ మరింతగా బలపడిందని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా యూత్ లో ఈ సాంగ్ భారీగా వైరల్ అవుతూ రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతోంది.

స‌క్సెస్ ఫార్ములాగా నాని- అనిరుధ్ కాంబో

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ మరోసారి ఈ సాంగ్ తో తన మ్యాజిక్‌ను చూపించారు. గతంలో అత‌ను అందించిన హిట్ సాంగ్స్ సరసన ఆయా షేర్ కూడా నిలిచిపోయేలా ఉంది. ఈ సాంగ్ బీట్, ఎనర్జీ, మరియు మాస్ ఫీలింగ్ ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించేలా ఉండబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నాని- అనిరుధ్ కాంబినేషన్ లో ఇప్ప‌టికే ప‌లు హిట్ సాంగ్స్ రాగా, ఇప్పుడు మ‌రోసారి ఈ కాంబినేష‌న్ సక్సెస్ ఫార్ములాగా మారిందని ఆయా షేర్ సాంగ్ ప్రూవ్ చేసింది.

ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్ తో..

డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల ఈ సాంగ్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించారు. విజువల్స్ పరంగా ఈ సాంగ్ లో కనిపించే గ్రాండియర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే మాస్ ఎలిమెంట్స్, రా ఎనర్జీ, మరియు డార్క్ టోన్ సినిమా థీమ్‌ను బలంగా ప్రతిబింబిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై ఆయన పెట్టిన కృషి స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎలాంటి రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సాంగ్‌ను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ప్రొడక్షన్ విల్యూస్ ప్రతి షాట్‌లో కనిపిస్తూ సినిమాకు రిచ్ లుక్‌ను తీసుకువచ్చాయి. ఈ స్థాయి నిర్మాణం సినిమాపై ఉన్న ఆసక్తిని మరింతగా పెంచుతోంది.

ఇవి మాత్ర‌మే కాకుండా ది ప్యార‌డైజ్ కాస్టింగ్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మోహన్ బాబు, రాఘవ జుయాల్, సంపూర్ణేశ్ బాబు లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విభిన్నమైన కాంబినేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. మొత్తానికి ఆయా షేర్ సాంగ్ సాధించిన 100 మిలియన్ వ్యూస్ ఫీట్ సినిమా ప్రమోషన్స్‌కు భారీ బూస్ట్ ను ఇచ్చింది. ఈ సాంగ్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో ఆగస్టు 21, 2026న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.