Begin typing your search above and press return to search.

కొడుకుకు ఫుల్ ఫ్రీడమ్.. కానీ శ్రీకాంత్ ఓదెలకు మాత్రం...

నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో.. కొన్ని రోజులుగా అదే చర్చ జరుగుతోంది. కానీ ఆయన చేసిన రీసెంట్ కామెంట్స్ వింటే మాత్రం సీన్ రివర్స్ అనిపిస్తుంది.

By:  M Prashanth   |   27 Sept 2026 9:31 AM IST
కొడుకుకు ఫుల్ ఫ్రీడమ్.. కానీ శ్రీకాంత్ ఓదెలకు మాత్రం...
X

నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో.. కొన్ని రోజులుగా అదే చర్చ జరుగుతోంది. కానీ ఆయన చేసిన రీసెంట్ కామెంట్స్ వింటే మాత్రం సీన్ రివర్స్ అనిపిస్తుంది. తన కొడుకు జున్నూతో కంటే దర్శకుడు శ్రీకాంత్ విషయంలోనే తాను ఎక్కువ స్ట్రిక్ట్‌ గా ఉంటానని నాని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయమేంటంటే..

దసరాతో దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నానినే. తొలి సినిమాతోనే శ్రీకాంత్ తనలోని మాస్ టాలెంట్‌ ను చూపించారు. ఆ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య రిలేషన్ కూడా మరింత స్ట్రాంగ్ గా మారింది. ఇప్పుడు ది ప్యారడైజ్ తో మరోసారి కలిసి పనిచేయడం తో ఆ కాంబోపై ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే శ్రీకాంత్‌ కు నాని చాలా ఫ్రీడమ్ ఇస్తాడని బయట నుంచి చూస్తే అనిపిస్తుంది.

కానీ అసలు విషయం మాత్రం వేరట. ప్యారడైజ్ మీడియా ములాఖత్‌ లో నాని ఇదే విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శ్రీకాంత్ విషయంలో తాను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటానని చెప్పారు. తన తండ్రి తనతో ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారో.. ఇప్పుడు తాను శ్రీకాంత్‌తో అంతే స్ట్రిక్ట్ గా ఉంటున్నానని వివరించారు. ఇదే సమయంలో తన కొడుకు జున్నూతో మాత్రం అలా ఉండలేకపోతున్నానని, పేంపరింగ్ చేస్తున్నానని అన్నారు.

అంటే శ్రీకాంత్‌ను కేవలం దర్శకుడిగా కాకుండా తనకు చాలా దగ్గరైన వ్యక్తిగా చూస్తున్నారన్నమాట. సినిమా విషయంలో మాత్రం రాజీ పడకుండా పని చేయించుకోవాలని నాని భావిస్తున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. వీరిద్దరి మధ్య ఆ రిలేషన్ దసరాతో మొదలైంది. ఆ సినిమా సమయంలో ఏర్పడిన రిలేషన్.. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్ గా కూడా మారింది. శ్రీకాంత్ తనను చిన్న తమ్ముడిలా భావిస్తాడని నాని గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

మరోవైపు తన కెరీర్‌ కు నాని ఇచ్చిన ఛాన్స్, చేసిన సపోర్ట్ గురించి శ్రీకాంత్ కూడా పలుమార్లు ఎమోషనల్ అయ్యారు.. అంత దగ్గరైన వాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు కూడా సహజమే. ప్యారడైజ్ షూటింగ్ సమయంలో తమ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని శ్రీకాంత్ స్వయంగా చెప్పారు. నాని తనను తిట్టిన సందర్భాలు ఉన్నాయని, తాను కూడా నానితో గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయని వెల్లడించారు.

అయితే అవన్నీ సినిమా విషయంలో తప్ప పర్సనల్ కాదని క్లారిటీ ఇచ్చారు. అందుకే నాని-శ్రీకాంత్ రిలేషన్ లో ఫ్రీడమ్ ఉన్నా.. సినిమా దగ్గరకు వచ్చేసరికి ఇద్దరూ తమ పద్ధతిలో ఉంటారనిపిస్తోంది. నాని హీరోగా మాత్రమే కాకుండా శ్రీకాంత్‌ కు ఒక గైడ్‌ లా ఉంటే.. శ్రీకాంత్ తన ఆలోచనల విషయంలో తగ్గకుండా ముందుకు వెళ్తున్నారు. కొడుకుపై ప్రేమతో స్ట్రిక్ట్ గా ఉండలేని నాని, శ్రీకాంత్ విషయంలో మాత్రం దర్శకుడి నుంచి బెస్ట్ అవుట్‌ పుట్ తీసుకోవడానికి మాత్రం అస్సలు తగ్గడం లేదన్న మాట.