కింగ్ డమ్ కోసం నాని..?
విజయ్ దేవరకొండ కింగ్ డం సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
By: Ramesh Boddu | 30 July 2025 4:00 PM ISTవిజయ్ దేవరకొండ కింగ్ డం సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కింగ్ డం సినిమాపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ మాసివ్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది. లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ స్టార్ చాలా డిజప్పాయింట్ చేశాడు. అందుకే కింగ్ డమ్ తో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు విజయ్.
కింగ్ డమ్ రిజల్ట్ పై నాని ఆసక్తి..
ఐతే ఈ సినిమా రిజల్ట్ పై న్యాచురల్ స్టార్ నాని కూడా ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తుంది. అదేంటి విజయ్ దేవరకొండ సినిమాకు నాని ఎందుకు ఎగ్జైట్మెంట్ అంటే.. నాని విజయ్ చాలా క్లోజ్. వాళ్ల ఫ్యాన్స్ ఎలా ఉన్నా వాళ్లిద్దరు ఒకరి మీద ఒకరు చాలా ప్రేమతో ఉంటారు. అంతేకాదు కింగ్ డం గౌతం తిన్ననూరి ఇదివరకు నానితో జెర్సీ సినిమా చేశాడు. నాని కెరీర్ లో జెర్సీ ఒక మంచి సినిమా.
నార్త్ సైడ్ నాని జెర్సీ సినిమాకు చాలామంచి ఫ్యాన్స్ ఉన్నారు. అదీగాక నాని గౌతం తిన్ననూరి ఒక ప్రాజెక్ట్ కూడా డిస్కషన్ లో ఉంది. నాని ప్రస్తుతం ప్యారడైజ్ తో పాటు సుజిత్ డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా పూర్తైతే గౌతం తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. నానితో ఈసారి ఒక యాక్షన్ అడ్వెంచర్ ప్లాన్ చేస్తున్నాడు గౌతం. ఐతే ఆ సినిమా ఓకే చేయాలంటే ముందు గౌతం కింగ్ డం తో తనని తాను ప్రూవ్ చేసుకోవాలి.
టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీస్..
అంటే కింగ్ డమ్ రిజల్ట్ అటు ఇటైతే నాని ఛాన్స్ ఇవ్వడా అంటే అలా కాదు కానీ ఆల్రెడీ జెర్సీ లాంటి సినిమా ఇచ్చాడు కాబట్టి అతని నుంచి విజయ్ హీరోగా వస్తున్న కింగ్ డమ్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని నాని భావిస్తున్నాడు. అందుకే కింగ్ డమ్ ని నాని చూస్తున్నాడట. నాని మాత్రమే కాదు విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాను టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీస్ చూడబోతున్నారని తెలుస్తుంది. విజయ్ ఖాతాలో హిట్ పడాలని సినీ సెలబ్రిటీస్ కూడా కోరుతున్నారు. కింగ్ డమ్ అంచనాలను అందుకుంటే మాత్రం రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి విజయ్ దేవరకొండ కింగ్ డం ఏం చేస్తుందో చూడాలి.
