Begin typing your search above and press return to search.

నాని సినిమాకు OG హైప్..!

న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను 2026 మార్చ్ 28 రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న నాని ఆ మూవీ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ సినిమాతో రాబోతున్నాడు.

By:  Ramesh Boddu   |   1 Dec 2025 12:24 PM IST
నాని సినిమాకు OG హైప్..!
X

న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను 2026 మార్చ్ 28 రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న నాని ఆ మూవీ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ సినిమాతో రాబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ లాంటి సినిమా తీసిన సుజీత్ డైరెక్షన్ లో నాని సినిమా వస్తుంది. నాని, సుజీత్ కాంబినేషన్ సినిమాపై కొన్నాళ్లుగా డిస్కషన్ జరుగుతున్నా ఫైనల్ గా ఇన్నాళ్లకు ఈ సినిమా పట్టాలెక్కేసింది.

ఓజీ తర్వాత సుజీత్ చేస్తున్న సినిమా..

ఐతే ఈ సినిమాను అసలైతే ముందు డివివి దానయ్య నిర్మించాలని అనుకున్నారు. కానీ సినిమాను ఫైనల్ గా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఓజీ తర్వాత సుజీత్ చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై సూపర్ హైప్ ఉంది. ఐతే ఈ సినిమాకు టైటిల్ గా గన్స్ అండ్ రోజెస్ అని పెట్టబోతున్నారట. అంతకుముందు ఈ మూవీకి బ్లడీ రోమియో అనే టైటిల్ పరిశీలించారని టాక్. ఐతే ఇప్పుడు ఆ టైటిల్ ని గన్స్ అండ్ రోజెస్ గా మారుస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కూడా సుజీత్ గన్స్ అండ్ రోజెస్ సాంగ్ పెట్టాడు. ఇప్పుడు నాని సినిమాకు గన్స్ అండ్ రోజెస్ టైటిల్ పరిశీలిస్తున్నారట.

అఫీషియల్ గా చెప్పలేదు కానీ నాని సుజీత్ సినిమా టైటిల్ గన్స్ అండ్ రోజెస్ అని దాదాపు ఫిక్స్ అయ్యారట. ఐతే ఈ సినిమాలో నాని స్టైలిష్ యాక్షన్ హీరోగా కనిపిస్తారట. నాని కోసం కొత్తగా కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సుజీత్. ఇక ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. నాని హీరోగా ఓజీ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ కాబట్టి ఏ స్టార్ హీరోయిన్ అయినా సినిమాకు ఓకే చెప్పే ఛాన్స్ ఉంది.

నాని, సుజీత్.. గన్స్ అండ్ రోజెస్

నాని కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తుంది. ఓజీ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన సుజీత్ ఈసారి నాని కోసం ఎలాంటి స్టోరీ, స్క్రీన్ ప్లేతో వస్తాడన్న ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఐతే ఈ సినిమా విషయంలో నాని ఫ్యాన్స్ అయితే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ది ప్యారడైజ్ అనంతరం నాని చేస్తున్న సుజీత్ సినిమా కూడా నాని మార్క్ సినిమాగా అదరగొట్టేస్తుందని అంటున్నారు.

నాని మామూలుగా అయితే కొత్త డైరెక్టర్స్ తో ఎక్కువ పనిచేస్తాడు. వాళ్లైతే కసితో సినిమా చేస్తారన్నది నాని నమ్మకం. ఐతే స్టార్ డైరెక్టర్స్ తో నాని సినిమా చేస్తే చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక. అందుకే ఈసారి సుజీత్ లాంటి స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నాడు. నాని నుంచి ఫ్యాన్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేయని ఒక డిఫరెంట్ సినిమా చేయాలని అంటున్నారు. ఐతే సుజీత్ కూడా అందుకు గట్టి ఎఫర్ట్స్ పెడుతున్నాడని తెలుస్తుంది.