నానితో సుజీత్ మూవీ.. పండుగ నాడే మొదటి అడుగు
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ రీసెంట్ గా ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
By: M Prashanth | 2 Oct 2025 7:16 PM ISTటాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ రీసెంట్ గా ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే సుజీత్ కు గుడి కట్టినా పర్లేదని అన్నారు. తాము ఎలా కావాలో పవన్ ను అలాగే చూపించారని కొనియాడారు.
అలా ఓజీతో మెప్పించిన సుజీత్.. ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ పనులను మొదలుపెట్టారు. నేచురల్ స్టార్ నానితో చేయనున్న ప్రాజెక్టును త్వరలో స్టార్ట్ చేస్తానని ఇటీవల చెప్పిన సుజీత్.. తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయదశమి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పూజ సెర్మనీని గ్రాండ్ గా జరిపారు.
బ్లడీ రోమియో వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న నాని- సుజీత్ మూవీ గురువారం నాడు అధికారికంగా లాంచ్ అయింది. ఆ కార్యక్రమానికి నాని, సుజీత్ తో పాటు మూవీ టీమ్ అటెండ్ అయింది. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యి సందడి చేశారు. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు.. నాని, సుజీత్ లకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరోసారి ఆడియన్స్ ను అలరించాలని కోరుతున్నారు. అయితే 2025 డిసెంబర్ లో సినిమా షూటింగ్ ను సుజీత్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అప్పటికి నాని.. తన చేతిలో ఉన్న ప్యారడైజ్ మూవీ చిత్రీకరణను పూర్తి చేసుకుని ఫ్రీ అవుతారట.
వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా నాని- సుజీత్ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకట్ బోయనపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మిగతా క్యాస్టింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.
అయితే నాని- సుజీత్ మూవీలో విలన్ గా మాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన సలార్ తో టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఇప్పుడు మహేష్ బాబు- జక్కన్న మూవీలో నటిస్తున్నారు. అలా నాని మూవీలోనూ ఛాన్స్ అందుకున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత ఉందో వేచి చూడాలి.
