నేచురల్ స్టార్ తర్వాతే పవన్ తో..
అయితే ఓజి సినిమా క్లైమాక్స్ లో ఓజి కు సీక్వెల్ గా ఓజి2 అని వచ్చిన కార్డ్ థియేటర్లలో ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరించింది.
By: Sravani Lakshmi Srungarapu | 18 Nov 2025 11:00 PM ISTబాహుబలి పుణ్యమా అంటూ టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ ఊపందుకుంది. పెద్ద సినిమాలను రెండు భాగాలుగా చేయడం, లేదంటే సీక్వెల్స్ చేయడం కామనైపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్నో సినిమాలు రెండు భాగాలుగా రావడం, సీక్వెల్స్ రావడం జరగ్గా అందులో పలు సినిమాలు హిట్టైతే, మరికొన్ని సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి.
పవన్ స్టామినాను చాటిన ఓజి
ఇక అసలు విషయానికొస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలవడంతో పాటూ ఆ సినిమాతో పవన్ స్టామినా ఏంటనేది మరోసారి ప్రూవ్ అయింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టి, ఎంతో కాలంగా మంచి ఆకలితో ఉన్న ఫ్యాన్స్ ను ఫుల్ శాటిస్‌ఫై చేసింది.
ఓజి2 ఉంటుందని క్లారిటీ ఇచ్చిన పవన్
అయితే ఓజి సినిమా క్లైమాక్స్ లో ఓజి కు సీక్వెల్ గా ఓజి2 అని వచ్చిన కార్డ్ థియేటర్లలో ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరించింది. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు తప్ప పవన్ కొత్త సినిమాలు చేయరని భావించిన ఫ్యాన్స్ కు ఈ వార్త ఎంతో సంతృప్తినిచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఓజి2 ఉంటుందని సభా ముఖంగా చెప్పి ఫ్యాన్స్ లో కొత్త జోష్ ను నింపారు.
ఓజి2 కంటే ముందు నానితో..
అయితే తాజా సమాచారం ప్రకారం ఓజి2 సినిమా 2026 ఎండింగ్ లో మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఓజి2 కంటే ముందు డైరెక్టర్ సుజిత్, నేచురల్ స్టార్ నానితో ఓ సినిమాను చేయాల్సి ఉండగా, ఈ లోపు పవర్ స్టార్ కూడా మరికొన్ని ప్రాజెక్టులు చేసే వీలున్నట్టు సమాచారం. ప్రస్తుతం ది ప్యారడైజ్ తో బిజీగా ఉన్న నాని, ఆ సినిమా తర్వాత సుజిత్ తో సినిమా చేసే అవకాశముంది. ఇప్పటికైతే ఓజి2 నెక్ట్స్ ఇయర్ ఎండింగ్ లో అంటున్నారు కానీ పవన్ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అది అంత త్వరగా కుదిరే వీలుండకపోవచ్చు.
