Begin typing your search above and press return to search.

నాని సుజీత్.. క్రిస్మస్ కి లాక్..?

ఐతే నాని సినిమాలు అన్నీ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఓపెనింగ్ రోజే రిలీజ్ ఎప్పుడన్న క్లారిటీతో మొదలు పెడతారు. దానికి తగినట్టుగానే షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ ఉంటుంది.

By:  Ramesh Boddu   |   1 Nov 2025 12:00 PM IST
నాని సుజీత్.. క్రిస్మస్ కి లాక్..?
X

నాని ది ప్యారడైజ్ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి రిలీజ్ లో డౌట్ లేదు. రిలీజ్ డేట్ టార్గెట్ పెట్టుకుని మరీ సినిమా షూట్ చేస్తున్నారు. పోటీలో చరణ్ పెద్ది ఉన్నా కూడా ప్యారడైజ్ విషయంలో నాని అసలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తుంది. దసరా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఇక సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి. నాని ఈసారి మళ్ళీ ఏదో బ్రహ్మాండాన్ని సృష్టించేలా ఉన్నాడనిపిస్తుంది.

నాని సుజీత్ ఈ కాంబో అసలు ఊహించలేదు..

నాని ది ప్యారడైజ్ తర్వాత ఓజీ సుజీత్ తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈమధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విషయంలో ఆడియన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. నాని సుజీత్ ఈ కాంబో అసలు ఊహించలేదు. అది కూడా పవర్ స్టార్ తో ఓజీ చేశాక నానితో సుజీత్ సినిమా నాని ఫ్యాన్స్ కి సూపర్ ఎగ్జైట్ అనిపిస్తుంది. బ్లాడీ రోమియో టైటిల్ తో ఈ కాంబో సినిమా సంథింగ్ స్పెషల్ గా అది కూడా డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో వస్తుందని అంటున్నారు.

ఐతే నాని సినిమాలు అన్నీ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఓపెనింగ్ రోజే రిలీజ్ ఎప్పుడన్న క్లారిటీతో మొదలు పెడతారు. దానికి తగినట్టుగానే షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ ఉంటుంది. సో ఇప్పుడు సుజీత్ సినిమా విషయంలో కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారట. నాని సుజీత్ కాంబో మూవీ నెక్స్ట్ క్రిస్మస్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్నారని తెలుస్తుంది. సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే రిలీజ్ డేట్ ఎలా అంటే.. అలా ఫిక్స్ చేసుకుంటేనే ఆ టార్గెట్ తో సినిమా పూర్తి చేసే ఛాన్స్ ఉంటుందని నాని అండ్ టీం అనుకుంటున్నారు.

నాని కాన్ స్టంట్ హిట్లతో సూపర్ ఫామ్..

ఓజీ తర్వాత సుజీత్ నానితో సినిమా చేయడం కూడా అతని తెలివైన నిర్ణయమే. నాని ఈమధ్య కాన్ స్టంట్ హిట్లతో సూపర్ ఫాం కొనసాగిస్తున్నాడు. సో నానితో మినిమం గ్యారెంటీ సినిమా తీసినా అది సూపర్ హిట్ అవుతుంది. కథతో పాటు సినిమా అన్ని విషయాల్లో ఇంకా ప్రమోషన్స్ లో కూడా నాని పూర్తిస్థాయిలో ఇన్వాల్వ్ మెంట్ అవుతాడు. అదంతా సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. అందుకే నాని హీరోగా సినిమా అంటే నిర్మాతలు రిలాక్స్ అవుతున్నారు.

ది ప్యారడైజ్ తో మరోసారి తన మాస్ పవర్ చూపించాలని చూస్తున్న నాని ఆ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు అన్నది చూడాలి. నాని సుజీత్ సినిమా కూడా క్రేజీగా ఉంటుందని తెలుస్తుంది. మరి నాని సుజీత్ కాంబో సినిమా మిగతా కాస్ట్ డీటైల్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.