Begin typing your search above and press return to search.

నాని- సుజీత్ మూవీ మొత్తం అక్కడే.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   19 Oct 2025 6:00 AM IST
నాని- సుజీత్ మూవీ మొత్తం అక్కడే.. రిలీజ్ ఎప్పుడంటే?
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. నిజానికి సుజీత్ తన చివరి మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కన్నా ముందే నాని సినిమాను ప్రకటించారు. ఆ తర్వాత ఏడాది దాటినా ఒక్క అప్డేట్ ఇవ్వలేదు.

దీంతో సినిమా రద్దు అయిందని అనేక రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని ఓజీ ప్రమోషన్స్ లో సుజీత్ ఖండించారు. నానితో తాను మూవీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాకు సంబంధించి పలు విషయాలు కూడా పంచుకున్నారు. రీసెంట్ గా దసరా పండుగ సందర్భంగా సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

హైదరాబాద్ లో అక్టోబర్ 3వ తేదీన పూజా కార్యక్రమాలు జరగ్గా.. వేడుకకు సీనియర్ హీరో వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుందని అప్పుడు మేకర్స్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్‌ ఇవ్వనున్నామని చెప్పారు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వైరల్ గా మారింది. సినిమా కోసం 70 రోజుల షూటింగ్ షెడ్యూళ్లను మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మూవీకి సంబంధించిన మేజర్ పోర్షన్ ఫారిన్‌ లోనే జరగనుందని సమాచారం. ఇప్పటికే పలు దేశాల్లో లొకేషన్స్ కూడా సెట్ చేసుకున్నట్లు వినికిడి.

వచ్చే ఏడాది దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే షూటింగ్ కాస్త లేట్ అయితే.. 2026 డిసెంబర్ లో విడుదల అవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా.. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాదని సమాచారం. ఇంతకు ముందు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు సుజీత్.

తన డెబ్యూ మూవీ రన్ రాజా రన్ లో నాని మూవీ ఉంటుందని చెప్పారు. డార్క్ కామెడీకి కాస్త యాక్షన్ జోడించి చేస్తున్నట్లు మరో ఇంటర్వ్యూలో తెలిపారు. కొత్త మోడల్ కథ అని పేర్కొన్నారు. అయితే నాని- సుజీత్ మూవీకి బ్లడీ రోమియో అనే టైటిల్‌ ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. అదే ఫిక్స్ అని టాక్.