Begin typing your search above and press return to search.

ఏడాది ఎదురుచూపులకు తెర.. నానితో ఛాన్స్‌!

అందుకే సుజీత్‌కు ముందుగానే సినిమాను ఆరు నెలల లోపు పూర్తి చేయాలని చెప్పాడట. అందుకు తగ్గట్లుగా సుజీత్‌ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

By:  Ramesh Palla   |   29 Sept 2026 12:18 PM IST
ఏడాది ఎదురుచూపులకు తెర.. నానితో ఛాన్స్‌!
X

నాని తాజాగా 'ది ప్యారడైజ్‌' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఒక వైపు పోస్ట్‌ రిలీజ్ ప్రమోషన్‌లో పాల్గొంటూనే మరో వైపు తన తదుపరి సినిమా 'బ్లడీ రోమియో' సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం అందుతోంది. చాలా కాలం క్రితం కలిసి వర్క్ చేయాల్సిన నాని, సుజీత్‌ ఫైనల్‌గా ఈ ఏడాది లో తమ కాంబో మూవీని పట్టాలెక్కించబోతున్నారు. ది ప్యారడైజ్ సినిమా కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకున్న నాని తదుపరి సినిమాల విషయంలో జెట్‌ స్పీడ్‌ మెయింటెన్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే సుజీత్‌కు ముందుగానే సినిమాను ఆరు నెలల లోపు పూర్తి చేయాలని చెప్పాడట. అందుకు తగ్గట్లుగా సుజీత్‌ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. వచ్చే నెలలోనే షూటింగ్‌ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌ కి బ్లడీ రోమియోను విడుదల చేయబోతున్నారట.

సుజీత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ మూవీ...

సుజీత్‌ తన ప్రతి సినిమాలోనూ హీరోను చాలా వైవిధ్యభరితంగా, స్టైలిష్‌ లుక్‌లో చూపించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు బ్లడీ రోమియోలోనూ దర్శకుడు సుజీత్‌ సరికొత్తగా నానిని ప్రజెంట్‌ చేస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇక నానికి జోడీగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని ఎంపిక చేయడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌ ను అనుకున్నారని, ఫైనల్‌గా మీనాక్షి చౌదరిని నానికి జోడీగా ఎంపిక చేయడం జరిగిందని యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. అయితే మీనాక్షి చౌదరి ఈ మధ్య కాలంలో పెద్దగా ఫామ్‌ లో లేదు అనేది కొందరి మాట. కానీ నాని సినిమాతో ఆమె తిరిగి ఫామ్‌లోకి వస్తుందని, తప్పకుండా మరోసారి ఆమె కెరీర్‌ స్పీడ్‌ అందుకుంటుంది అంటూ ఆమె సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా...

ఈ ఏడాదిలో సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలు విడుదల కాలేదు. ప్రస్తుతం మీనాక్షి చేతిలో నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న వృషకర్మ మాత్రమే ఉంది. గత ఏడాది కాలంగా మీనాక్షి కొత్త సినిమాలకు సైన్‌ చేసిందే లేదు. ఫైనల్‌గా నాని సినిమాకు మీనాక్షి సైన్ చేయబోతుందని, త్వరలో చేస్తుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. మొత్తానికి వృషకర్మ సినిమా విడుదల కాకుండానే నానితో సినిమా ఛాన్స్ కొట్టేయడంతో మీనాక్షి చౌదరి కచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాలు చేయబోతుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. 2024లో లెక్కకు మించి సినిమాలు చేసిన మీనాక్షి చౌదరి గత ఏడాదిలో కేవలం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని అనగనగా ఒక రాజు సినిమాతో వచ్చింది.

నాని, మీనాక్షి చౌదరి జంటగా బ్లడీ రోమియో...

మీనాక్షి చౌదరి చూడ్డానికి అందంగా ఉండటంతో పాటు, నటన విషయంలోనూ చాలా మంది హీరోయిన్స్‌తో పోల్చితే బెటర్‌ అనిపించుకుంది. అయినా కూడా లక్‌ కలిసి రాకపోవడంతో మీనాక్షికి ఆఫర్లు రావడం లేదు అనేది కొందరి మాట. ఇప్పుడు ఒక వైను నాగ చైతన్యతో మరో వైపు నానితో సినిమాలు చేస్తున్న కారణంగా వచ్చే ఏడాదిలో ఈమె జోరు కనబర్చే అవకాశాలు ఉన్నాయి. సుజీత్‌ సినిమా అంటే హీరోయిన్‌ కి మంచి గుర్తింపు ఉంటుంది. కనుక బ్లడీ రోమియోతో కచ్చితంగా ఈ అమ్మడికి గుర్తింపు దక్కడం ఖాయం, తద్వారా కెరీర్‌లో వరుసగా సినిమాలతో దూసుకు వెళ్లడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సుజీత్‌ దర్శకత్వంలో నాని హీరోగా నటించబోతున్న సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మించబోతున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.