మాస్ కా బాస్ అవ్వాలనే ఆశతో!
మాస్ ఇమేజ్ అనేది ఒక ఇన్విజిబుల్ పవర్ లాంటిది. హీరోని కేవలం నటుడి నుంచి బ్రాండ్ లేదా ఫోర్స్ గా మార్చేది ఈ మాస్ చిత్రాలే. వాణిజ్యపరంగా చూస్తే, మాస్ ఇమేజ్ అనేది ఒక హీరోకి ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది.
By: Srikanth Kontham | 8 March 2026 12:00 AM ISTమాస్ ఇమేజ్ అనేది ఒక ఇన్విజిబుల్ పవర్ లాంటిది. హీరోని కేవలం నటుడి నుంచి బ్రాండ్ లేదా ఫోర్స్ గా మార్చేది ఈ మాస్ చిత్రాలే. వాణిజ్యపరంగా చూస్తే, మాస్ ఇమేజ్ అనేది ఒక హీరోకి ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది.
క్లాస్ సినిమాలు హీరోకి గౌరవాన్ని ఇస్తే, మాస్ సినిమాలు దేవుడినే చేసేస్తుంటాయి. థియేటర్లలో ఈలలు, పేపర్ ముక్కలు చల్లడం, పాలాభిషేకాలు చేయడం వంటివి కేవలం మాస్ ఇమేజ్ ఉన్న హీరోలకే సాధ్యం. మాస్ సినిమాల వల్లే హీరోలకు బిరదులు సాధ్యమవుతుంది. ఈ ట్యాగ్ లు వారిని సామాన్య ప్రజల్లో ఐకాన్‌గా నిలబెడతాయి.
నటనతో సంబంధం లేకుండా కేవలం మాస్ ఇమేజ్ ఉండటం వల్ల ప్లాపుల్లో ఉన్నప్పుడు కూడా హీరోలు ఉనికిని కాపాడుకోగలరు. మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాకి టాక్ ఎలా ఉన్నా మొదటి మూడు రోజులు ఓపెనింగ్స్ తోనే థియేటర్లు నిండిపోతాయి. ఓపెనింగ్స్ అనేవి నిర్మాతకు సగం భారాన్ని తగ్గిస్తాయి. ఆదాయం ఎక్కువగా కనిపించేది. గ్రామీణ ప్రాంతాలు , చిన్న పట్టణాల నుంచే. మాస్ సినిమాలు అక్కడ విపరీతంగా ఆడుతాయి. క్లాస్ సినిమాలు కేవలం మల్టీప్లెక్స్‌లకే పరిమితం అయితే, మాస్ సినిమాలు రాష్ట్రం మొత్తం వసూళ్లు రాబడతాయి.
మాస్ ఇమేజ్ రెట్టింపు అయ్యే కొద్ది థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ధరలు కోట్లలో పెరుగుతాయి. అందుకే మాస్ కంటెంట్ ని తెలుగు హీరోలు ఎప్పుడూ మిస్ కారు. ఎన్ని ప్రయోగాలు చేసినా? మాస్ అంశాలున్న సినిమాల్ని ఆలస్యమైనా చేయాలనుకుంటారు. ఇప్పటికే కొంత మంది స్టార్ హీరోలకు మాస్ ఇమేజ్ అన్నది ఉండనే ఉంది. అలాంటి మాస్ ఇమేజ్ కోసం కొంత మంది హీరోలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. వారే నాని, శర్వానంద్, విజయ్ దేరకొండ. `దసరా` సినిమాతో నాని మంచి మాస్ అటెంప్ట్ చేసి సక్సెస్ అయ్యాడు.
కానీ అభిమానులకు ఆ కిక్ సరిపోదు. మాస్ లో తానో బ్రాండ్ అవ్వాలంటే మాస్ ఆడియన్స్ లోకి అతడి సినిమాలు ఇంకా బలంగా వెళ్లాలి. అందుకే `దసరా` ఫేం శ్రీకాంత్ ఓదెల తో మరోసారి రెట్టించిన మాస్ కంటెంట్ తో `ది ప్యారడైజ్` చేస్తున్నాడని ప్రచార చిత్రాలతో తేలిపోయింది. `దసరా` ను మించి నాని పాత్రలో మాస్ యాంగిల్ ఇందులో కనిపిస్తుంది. ఇప్పటికే మాస్ బీట్ ట్యూన్స్ మార్కెట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అలాగే శర్వానంద్ అంటే క్లాసిక్ గానే ఇప్పటి వరకూ హైలైట్ అయ్యాడు. కానీ తాజా సినిమా `భోగీ`తో అతడిలో మాస్ యాంగిల్ ని మళ్లీ తట్టిలేపుతున్నాడు.
ఆ సినిమా ప్రచార చిత్రాలతో శర్వాలో మాసీవ్ కోణాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజా పోస్టర్ లో శర్వా మాస్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే విజయ్ దేవరకొండ కూడా `కింగ్ డమ్` తో మాస్ అటెంప్ట్ చేసాడు. ఆ పాత్రను కొంత వరకూ బాగానే హైలైట్ చేసారు. కానీ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వాలంటే ఆ డోస్ సరిపోదు. ప్రస్తుతం నటిస్తోన్న `రణబాలి`తో అది సాద్యమవుతుందని విజయ్ నమ్ము తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు..ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
