Begin typing your search above and press return to search.

ప్యార‌డైజ్ లో నాని మాస్‌కు అసలు బ్యాక్‌బోన్ ఇదే!

అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా డిస్క‌ష‌న్ చూస్తే.. స్క్రీన్‌పై కనిపించే యాక్షన్ కంటే కథను ముందుకు నడిపించేది మరో అంశం కావచ్చనే ఆసక్తి మొదలైంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 Sept 2026 12:22 PM IST
ప్యార‌డైజ్ లో నాని మాస్‌కు అసలు బ్యాక్‌బోన్ ఇదే!
X

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో దసరా తర్వాత వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటివరకు పక్కింటి కుర్రాడి తరహా సహజమైన పాత్రలతో ఎక్కువగా మెప్పించిన నాని.. ఇప్పుడు మాస్, యాక్షన్, డార్క్ షేడ్స్ ఉన్న కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హిట్3లో తన మాస్ యాంగిల్‌ను నెక్ట్స్ లెవెల్ లో చూపించిన ఆయన.. ఇప్పుడు దసరా డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి ది ప్యారడైజ్ తో మరింత భిన్నమైన ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా డిస్క‌ష‌న్ చూస్తే.. స్క్రీన్‌పై కనిపించే యాక్షన్ కంటే కథను ముందుకు నడిపించేది మరో అంశం కావచ్చనే ఆసక్తి మొదలైంది.

ది ప్యార‌డైజ్ ప్ర‌మోష‌న్స్ లో ఈ సినిమాకు మ‌రో పేరు పెట్టాల్సి వ‌స్తే స‌మ్మ‌క్క అనే టైటిల్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని నాని చేసిన కామెంట్స్ ఈ వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తున్నారు. నాని చెప్పిన మాట‌లు మామూలుగా అనిపించినా, దాని వెనుక కథలోని కీలకమైన క్లూ దాగి ఉందా అనే డిస్క‌ష‌న్ మొదలైంది. ఒక పాత్ర పేరు సినిమా టైటిల్ స్థాయికి సరిపోతుందని హీరో స్వయంగా చెప్పడం అంటే.. ఆ పాత్ర కేవలం కథలో కనిపించే క్యారెక్ట‌ర్ గా కాకుండా, హీరో జ‌ర్నీని ప్రభావితం చేసే కోర్ పాయింట్ కావచ్చనే అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక్కడే ది ప్యారడైజ్ సినిమాలోని మదర్ సెంటిమెంట్‌పై ఆసక్తి పెరుగుతోంది. తెలుగు సినిమాల్లో తల్లి- కొడుకు అనుబంధం కొత్త అంశం కాదు. అయితే శ్రీకాంత్ ఓదెల ఈ బాండింగ్ ను రెగ్యుల‌ర్ సెంటిమెంట్ సీన్స్‌కే పరిమితం చేయకుండా, ఒక మాస్ బ్యాక్‌డ్రాప్‌లో కథను నడిపించే శక్తిగా మలిచారా అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. జడల్ క్యారెక్ట‌ర్ లో నాని ఎదుర్కొనే సిట్యుయేష‌న్స్, అతని డెసిష‌న్స్, అతని తిరుగుబాటు వెనుక తల్లి ప్రభావం ఎంత ఉంటుందనేది సినిమాలో కీలకంగా మారే అవకాశముంది.

మరోవైపు గ్లింప్స్, టీజర్‌లో కనిపించిన రా విజువల్స్, యాక్షన్, వ‌యొలెన్స్ సినిమాపై ఒక రకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేశాయి. కానీ నాని చెబుతున్న విషయాలు మాత్రం ఈ సినిమా కేవలం యాక్షన్ డ్రామా కాదనే సంకేతాలను ఇస్తున్నాయి. అంటే బయటికి మాస్ సినిమా కనిపించినా.. లోపల మాత్రం తల్లీకొడుకు బాండింగే అసలు కథను నడిపించే ఎమోష‌న‌ల్ టూల్ కావ‌చ్చా అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సమ్మక్క అనే పేరు కేవలం మరో టైటిల్ ఆలోచనగా కాకుండా.. ది ప్యారడైజ్ కథలోని అసలు ఎమోషనల్ కోర్‌కు ఒక సంకేతమా అనే ప్రశ్నకు సెప్టెంబర్ 24న సమాధానం దొరకనుంది.