Begin typing your search above and press return to search.

సమంత సక్సెస్.. ప్రతిదీ ఆమె ప్లాన్ చేసుకున్న‌దేన‌ట‌!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల కెరీర్ జ‌ర్నీ గురించి మాట్లాడినప్పుడు సమంత పేరు తప్పకుండా వినిపిస్తుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   29 Jun 2026 7:38 PM IST
సమంత సక్సెస్.. ప్రతిదీ ఆమె ప్లాన్ చేసుకున్న‌దేన‌ట‌!
X

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల కెరీర్ జ‌ర్నీ గురించి మాట్లాడినప్పుడు సమంత పేరు తప్పకుండా వినిపిస్తుంది. దాదాపు పదిహేనేళ్లకు పైగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల ఆదరణను సంపాదించిన ఆమె కెరీర్‌పై తాజాగా హీరో నాని చేసిన కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సమంత స‌క్సెస్ ను అదృష్టంతో ముడిపెట్టడం సరైనది కాదని, ఆమె కెరీర్ వెనుక చాలా స్ప‌ష్ట‌మైన ప్రణాళిక, టార్గెట్ పై ఫోక‌స్, సరైన డెసిష‌న్స్ నిర్ణయాలు ఉన్నాయని నాని అభిప్రాయపడ్డారు.

సమంత గురించి మాట్లాడిన నాని, ఆమె చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్, కెరీర్ ఓరియెంటెడ్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఉన్న స్థాయికి చేరుకోవడం యాదృచ్ఛికంగా జరగలేదని, ప్రతి దశను ముందుగానే ఆలోచించి కెరీర్‌ను బిల్డ్ చేసుకుంద‌ని అన్నారు. మంచి ప్రాజెక్టులు దొరికాయి కాబట్టే స్టార్ కాలేదని, వాటిని ఎంపిక చేసే విషయంలో ఆమె చూపించిన విజన్‌నే స‌మంత అస‌లు స్ట్రెంగ్త్ అని ఆయన వ్యాఖ్యానించారు.

సినీ ఇండ‌స్ట్రీలో అవకాశాలు అందరికీ వచ్చినా, వాటిని సరైన సమయంలో సరైన విధంగా వినియోగించుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. నాని కామెంట్స్ లో కూడా ఇదే భావం స్పష్టంగా కనిపిస్తోంది. సమంత తన కెరీర్‌లో కమర్షియల్ సినిమాల‌తో పాటు నటిగా తన టాలెంట్ ను చాటుకునే పాత్రలను కూడా సమతుల్యంగా ఎంచుకుంటూ ముందుకు సాగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే ఆమెను మిగతా హీరోయిన్లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టిందని చెప్పొచ్చు.

ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఎన్నో ఛాలెంజెస్ ఎదురైనా, వాటి ప్రభావం కెరీర్‌పై పడకుండా తిరిగి బలంగా నిలబడటం కూడా సమంత ప్రత్యేకతగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తుంటాయి. సినిమా ఎంపికల్లోనూ, కొత్త ప్రయోగాలకు సిద్ధపడటంలోనూ ఆమె చూపిన ధైర్యం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. నాని కామెంట్స్ కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేశాయి. సమంత జ‌ర్నీని నాని విశ్లేషించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఆమె స్టార్‌డమ్ వెనుక ఉన్న అసలు బలం టాలెంట్‌తో పాటు కెరీర్‌ను వ్యూహాత్మకంగా నిర్మించుకున్న ఆలోచన విధానమేనని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.