96 దర్శకుడితో నేచురల్ స్టార్ నాని !
నేచురల్ స్టార్ నాని విభిన్నమైన కథాంశాలతో దూసుకుపోతున్నారు. ఇటు మాస్.. అటు క్లాస్ ప్రేక్షకులను అలరి స్తున్న నాని తాజాగా మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
By: Srikanth Kontham | 14 Oct 2026 11:00 PM ISTనేచురల్ స్టార్ నాని విభిన్నమైన కథాంశాలతో దూసుకుపోతున్నారు. ఇటు మాస్.. అటు క్లాస్ ప్రేక్షకులను అలరి స్తున్న నాని తాజాగా మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళంలో `96`, `మెయ్యళగన్` (తెలుగులో సత్యం సుందరం) వంటి క్లాసిక్ ఎమోషనల్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సి. ప్రేమ్ కుమార్‌తో నాని ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని ..సుజీత్ తో కలసి `బ్లడీ రోమియో` అనే హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే 2027 ద్వితీయార్థంలో ప్రేమ్ కుమార్‌తో జతకట్టే చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.
భిన్నమైన టేకింగ్, సున్నితమైన భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడైన ప్రేమ్ కుమార్ కథకు నాని ఫిదా అయి కమిట్ అయినట్లు వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాని- దిల్ రాజు కాంబినేషన్లో గతంలో `నేను లోకల్`, `మిడిల్ క్లాస్ అబ్బాయి` (MCA), `వి ` వంటి చిత్రాలు రాగా ఇది వారి కలయికలో రాబోయే నాల్గవ చిత్రం అవుతుంది.
ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన `96`, `మెయ్యళగన్` రెండు సినిమాలు మానవ సంబంధాలు, స్వచ్ఛమైన అను బంధాల చుట్టూ తిరిగే కథలే. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకుల మనసు లను గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో నాని లాంటి సహజనటుడితో ప్రేమ్ చేసే సినిమా కూడా అదే తరహాలో లోతైన భావోద్వేగాలు, గుర్తుండిపోయే క్యారెక్టరైజేషన్లతో ఉంటుందని భావిస్తున్నారు.
మాస్, యాక్షన్ చిత్రాలతో పాటు భావోద్వేగాలతో కూడిన క్లాస్ చిత్రాలకు నాని ఇచ్చే ప్రాధాన్యత ఆయన సక్సెస్ గ్రాఫ్‌ను పెంచుతూ వస్తోంది. ప్రేమ్ కుమార్ చెప్పిన లైన్ నానికి నచ్చడంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ కాంబినేషన్ ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.
ప్రేమ్ కుమార్ తో సినిమా చేయాలని సూర్య కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రేమ్ మాత్రం ఛాన్స్ తీసుకోవడం లేదు. ఆయన ఇమేజ్ కు తాను రాసే ఎమోషనల్ కథలు ఎంత వరకూ సెట్ అవుతాయి? అన్న మీమాసంలో కమిట్ అవ్వలేకపోతున్నారు. కానీ అలాంటి అరుదైన ఛాన్స్ ఇప్పుడు నానికి వస్తుంది.
