మోహన్ బాబు ఇంపాక్ట్ ఏంటో మళ్లీ చూస్తారు: `ది ప్యారడైజ్` వేదికపై నాని!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ప్యారడైజ్`.
By: Sivaji Kontham | 22 Sept 2026 9:42 AM ISTటాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ప్యారడైజ్`. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అత్యంత వైభవంగా జరగగా.. ఈ వేదికపై ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు గురించి నాని మాట్లాడిన మాటలు ప్రస్తుతం సినీ వర్గాల్లో- సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా మోహన్‌బాబు కటౌట్.. ఆయన ఇంపాక్ట్ .. సినిమాలోని పాత్ర గురించి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మోహన్‌బాబు గారు ఏంటి? ఆయన కటౌట్ ఏంటి? ఆయన ఇంపాక్ట్ ఏంటి? ఇవన్నీ `ది ప్యారడైజ్` సినిమా మరోసారి అందరికీ గుర్తు చేస్తుందని నాని పేర్కొన్నారు. తెలుగు సినిమా తరతరాలు మారుతున్నా.. మోహన్‌బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ .. ఆయన ప్రభావం ఎప్పటికీ ప్రత్యేకమేనని కొనియాడారు. ఈ చిత్రంలో ఆయన కనిపించే తీరు.. ఆయన క్రియేట్ చేయబోయే ఇంపాక్ట్ చూసి ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ అవుతారని నాని ధీమా వ్యక్తం చేశారు.
అయితే బయట ప్రపంచంలో మోహన్‌బాబు గారి గురించి చాలామందికి ఒక అపోహ ఉందని నాని స్పష్టం చేశారు. ఆయనను చూసి చాలామంది కోపిష్ఠి అని అనుకుంటారు కానీ.. నిజ జీవితంలో ఆయనొక `వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్` అని నాని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తిగా తనకు ఆయన వ్యక్తిత్వం ఎంతగానో తెలుసని.. ఆయనొక ``అడోరబుల్ పర్సనాలిటీ``, ``గొప్ప హృదయం ఉన్న స్వీట్‌హార్ట్`` అని ప్రశంసించారు. ఆయనతో పనిచేయడం తనకు ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అని వెల్లడించారు.
ఇక ఈ చిత్రంలో మోహన్‌బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. ఈ సినిమాలో ఆయన `షికంజ మాలిక్` అనే పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ప్రత్యేకమైన గెటప్, హెయిర్‌స్టైల్ .. ఆయన ఎదురుగా వచ్చే జడల అప్పీయరెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని నాని తెలిపారు. తెరపై షికంజ మాలిక్ చేసే అల్లరిని, ఆయన హావభావాలను చూసి ప్రేక్షకులు థియేటర్లలో ఎంతగానో ఎంజాయ్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని నాని నమ్మకం వ్యక్తం చేశారు.
మొత్తానికి `ది ప్యారడైజ్` చిత్రంలో మోహన్‌బాబు నటన సినిమాకే హైలైట్‌గా నిలవనుందని నాని మాటల ద్వారా స్పష్టమైంది. ఒక లెజెండరీ నటుడి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. శ్రీకాంత్ ఒడెల టేకింగ్ కలగలిపి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ వేదికపై నాని మోహన్‌బాబును గౌరవించిన తీరు, ఆయనపై చూపిన అభిమానం ఇండస్ట్రీలో అందరినీ ఆకట్టుకుంది.
