Begin typing your search above and press return to search.

'పెద్ది', 'ప్యారడైజ్'.. ఒకరు డిసైడ్ అయినట్లేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   9 Dec 2025 10:48 AM IST
పెద్ది, ప్యారడైజ్.. ఒకరు డిసైడ్ అయినట్లేనా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు చరణ్ పెద్ది మూవీని కంప్లీట్ చేస్తుండగా.. ఇటు నాని ప్యారడైజ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతుండగా.. రెండింటిపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ రెండు సినిమాలను కూడా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27వ తేదీన పెద్దిని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ మూవీ రిలీజ్ కు ముందు రోజు ప్యారడైజ్ ను మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది.

అయితే రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకరోజు తేడాతో రిలీజైతే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి క్లాష్ వస్తుందో తెలిసిన విషయమే. రిజల్ట్ పక్కన పెడితే.. కలెక్షన్లపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కాబట్టి చరణ్.. నానిలో ఎవరో ఒకరు డ్రాప్ అవ్వడం బెటర్ అని అంతా అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పోస్ట్ పోన్ అనౌన్స్మెంట్ రాలేదు.

కాబట్టి రెండు సినిమాలు అప్పుడే రిలీజ్ అవుతున్నాయా.. లేదో ఒక చిత్రం వాయిదా పడుతుందా అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్యారడైజ్ మూవీ పోస్ట్ పోన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో కాకుండా.. పెద్దితో పోటీ పడకుండా.. సమ్మర్ లో రిలీజ్ చేయాలనే యోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం షూటింగ్ పై ఫోకస్ పెట్టి.. త్వరలోనే మ్యాసివ్ అప్డేట్ తో ప్యారడైజ్ మేకర్స్ ప్రకటన ఇవ్వనున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే ప్యారడైజ్ మూవీనే పోస్ట్ పోన్ అవుతుందని కొన్ని రోజులుగా సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ ను ఇంకా మేకర్స్ స్టార్ట్ చేయలేదు. కంటిన్యూగా అప్డేట్స్ ఇవ్వడం లేదు.

కానీ పెద్ది మేకర్స్ మాత్రం.. వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన చికిరి చికిరి సాంగ్.. ఓ రేంజ్ లో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు న్యూ ఇయర్ స్పెషల్ గా డిసెంబర్ 31వ తేదీన మరో అప్డేట్ రానుంది. సంక్రాంతికి ఇంకో అప్డేట్ ఇవ్వనున్నారని సమాచారం. దీంతో ఓవైపు షూటింగ్ పూర్తి చేస్తూ.. మరోవైపు సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారని చెప్పాలి. మొత్తానికి చరణ్ తో పోటీ విషయంలో నాని వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు!