Begin typing your search above and press return to search.

బాహుబ‌లి మాహిష్మ‌తిని కొట్టేసేలా 30ఎక‌రాల్లో సెట్

ముక్కుకు రింగు.. పచ్చబొట్టు.. పొడవాటి జడతో నేచుర‌ల్ స్టార్ నాని స‌ర్ ప్రైజ్ ఇచ్చిన‌ప్పుడే ఇందులో ఏదో సంథింగ్ ఉంద‌ని అంతా ఊహించారు.

By:  Sivaji Kontham   |   9 Sept 2025 10:46 AM IST
బాహుబ‌లి మాహిష్మ‌తిని కొట్టేసేలా 30ఎక‌రాల్లో సెట్
X

ముక్కుకు రింగు.. పచ్చబొట్టు.. పొడవాటి జడతో నేచుర‌ల్ స్టార్ నాని స‌ర్ ప్రైజ్ ఇచ్చిన‌ప్పుడే ఇందులో ఏదో సంథింగ్ ఉంద‌ని అంతా ఊహించారు. ఇప్ప‌టివ‌ర‌కూ నాని- శ్రీ‌కాంత్ ఓదెల బృందం `ప్యార‌డైజ్` టీజ‌ర్, పోస్ట‌ర్ల‌తో చాలా మాయాజాలం సృష్టించింది. నాని త‌న కెరీర్ లో మునుపెన్న‌డూ లేనంత‌గా కండ‌లు పెంచి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. తాను ఎంచుకున్న పాత్ర లుక్ కోసం క‌ఠోర‌మైన‌ శిక్షణ పొందాడు. ఒక్క సినిమా కోసం రూపాల్ని మార్చే ఊస‌ర‌వెల్లిలా మారాడు.

ఈ సినిమా వచ్చే ఏడాది 26 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్లలో విడుదల కానుంది. ఆసక్తికరంగా స్పానిష్, ఇంగ్లీష్, బెంగాలీ సహా బహు భాషలలో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప‌ర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకి అద‌న‌పు బ‌లం కానుంది.

ఆస‌క్తిక‌రంగా ప్యార‌డైజ్ కోసం 30 ఎక‌రాల్లో బాహుబ‌లి మాహిష్మ‌తిని మించేలా సెట్ ని నిర్మిస్తున్నార‌ని స‌మాచారం. ఇది విన‌డానికి కొంత జోక్ గా అనిపించినా కానీ, టైమ్ పాస్ కోసం చెప్ప‌డం లేదు. నాని ఈ చిత్రంలో ఒక అద్భుత‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అత‌డు మురికివాడ‌ల నుంచి ఎదిగిన గొప్ప వ్య‌క్తిగా క‌నిపించ‌బోతున్నాడు. అంటే.. దీనికోసం మురికివాడ‌ను సృష్టించాలి క‌దా! అందుకే `బాహుబ‌లి ఆఫ్ స్ల‌మ్స్` పాత్ర కోసం `మాహిష్మ‌తి ఆఫ్ స్ల‌మ్స్`ని హైద‌రాబాద్ ఔట‌ర్ లోని 30 ఎక‌రాల్లో ఒక పెద్ద స్ల‌మ్ సెట్ ని క్రియేట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

మురికివాడల మధ్యలో ఒక భారీ వంపు ఉంటుంది. ఇది సినిమా పోస్టర్లలో, టీజ‌ర్ లో కనిపించింది. ఈ వంపు ప్రధాన పాత్ర సామ్రాజ్యానికి కేంద్రం. ``ఈ సెట్ `బాహుబలి ఫ్రాంచైజీ నుండి మహిష్మతి సామ్రాజ్యం అంత పెద్దది`` అని చెబుతున్నారు. ఇంత‌కుముందు విడుద‌లైన టీజర్‌లో మురికివాడల నుండి వచ్చి అధికారంలోకి వచ్చే పాత్రను నాని పోషిస్తున్నాడ‌ని స్ప‌ష్ఠంగా క్లారిటీ వ‌చ్చేసింది. ట్రైల‌ర్ తో మ‌రింత హైప్ పెంచుతార‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం పెండింగ్ ప‌నులు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి.

`దసరా` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత నాని- శ్రీ‌కాంత్ ఓదెల జోడీ ఈసారి ఏదైనా కొత్త‌గా ఏదైనా చేయాల‌ని త‌పిస్తున్నారు. దానికోసం ఎంపిక చేసుకున్న క‌థాంశం కూడా భారీ కాన్వాసుతో కుదిరింది.ఈ చిత్రంలో నాని విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నాడు. నిర్మాతలు రాజీ లేని బ‌డ్జెట్ ని వెచ్చించి ప్రామాణికతను సృష్టించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నాని కెరీర్ లో ఈ చిత్రం మార్కెట్ ప‌రంగా బెంచ్ మార్క్ ని సృష్టించ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.