Begin typing your search above and press return to search.

ప్యారడైజ్ గుట్టు విప్పిన మంచు అక్క..!

నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమా సెట్స్ మీద ఉంది. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

By:  Ramesh Boddu   |   14 Sept 2025 12:49 PM IST
ప్యారడైజ్ గుట్టు విప్పిన మంచు అక్క..!
X

నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమా సెట్స్ మీద ఉంది. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే జడల్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వదిలిన టీజర్ అదిరిపోయింది. ప్యారడైజ్ సినిమా తో నాని మరోసారి తన మాస్ స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. నాని ఈ సినిమాలో డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో విలన్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారని టాక్. ఐతే ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఆ విషయాన్ని రివీల్ చేయలేదు.

నాని ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు..

లేటెస్ట్ గా మంచు లక్ష్మి ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. అక్కడ ఆమె నాని ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్న విషయాన్ని రివీల్ చేశారు. అఫీషియల్ గా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఆ సినిమా కోసం నాన్న చాలా వర్క్ అవుట్ చేస్తున్నారని అన్నారు. అంతేకాదు యాక్టింగ్ లో ఎప్పటికీ ఆయన తనని ఇన్ స్పైర్ చేస్తూనే ఉంటారని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. మొత్తానికి ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు నటించడం పక్కా అని తేలింది.

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తన మార్క్ సినిమాలు చేస్తూ వచ్చారు మోహన్ బాబు. సోలో సినిమాలు మానేసి తనయులిద్దరినీ హీరోలుగా చేశాడు. ఐతే అడపాదడపా స్పెషల్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు మోహన్ బాబు. రీసెంట్ గా ఆయన కన్నప్పలో నటించారు. నెక్స్ట్ ది ప్యారడైజ్ లో తన విలనిజంతో అదరగొట్టబోతున్నారు.

మంచు వారమ్మాయి మంచు లక్ష్మి..

మేకర్స్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ తో ది ప్యారడైజ్ సినిమా బిగ్ థింగ్ ని రివీల్ చేయాలని అనుకున్నారు. కానీ ఈలోగా మంచు వారమ్మాయి మంచు లక్ష్మి ఈ విషయాన్ని లీక్ చేసింది. తప్పకుండా నాని వర్సెస్ మోహన్ బాబు ఈ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. ది ప్యారడైజ్ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లో హైదరాబాద్ లో జరిగిన కథతో వస్తుందట.

ఈ సినిమాలో నాని సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. దసరా తర్వాత శ్రీకాంత్ నాని ఈసారి దానికి మించి రికార్డులు షురూ చేయాలని ఫిక్స్ అయ్యారు. నాని ప్యారడైజ్ సినిమాలో ఇంకా చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయట. సినిమా టీజర్ తోనే రా అండ్ రస్టిక్ అటెంప్ట్ అని ఇంపాక్ట్ చూపించగా సినిమా వేరే లెవెల్ ఉండేలా చేస్తారని అంటున్నారు.