Begin typing your search above and press return to search.

ప్యార‌డైజ్ ఫ‌స్ట్ సింగిల్ ఎప్పుడంటే?

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస స‌క్సెస్‌ల‌తో మంచి జోష్ మీదున్నారు. స‌క్సెస్ ఇచ్చిన జోష్ లో నాని త‌న త‌ర్వాతి సినిమాను ఇంకా ఉత్సాహంగా చేస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   14 Nov 2025 11:49 AM IST
ప్యార‌డైజ్ ఫ‌స్ట్ సింగిల్ ఎప్పుడంటే?
X

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస స‌క్సెస్‌ల‌తో మంచి జోష్ మీదున్నారు. స‌క్సెస్ ఇచ్చిన జోష్ లో నాని త‌న త‌ర్వాతి సినిమాను ఇంకా ఉత్సాహంగా చేస్తున్నారు. ఆఖ‌రిగా హిట్3 తో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన నాని, ఇప్పుడు ది ప్యార‌డైజ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నానికి ద‌స‌రా లాంటి హిట్ సినిమాను అందించిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ది ప్యార‌డైజ్ పై భారీ అంచ‌నాలు

ది ప్యార‌డైజ్ ను శ్రీకాంత్, ద‌స‌రా సినిమా కంటే భారీగా తెర‌కెక్కిస్తుండ‌గా, ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి వ‌చ్చిన నాని ఫ‌స్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాల‌ను పెంచేశాయి. ఆ అంచనాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఇంకా భారీగా ఆ అంచ‌నాల‌ను పెంచేలా శ్రీకాంత్ ప్యార‌డైజ్ ను రూపొందిస్తున్నారు. మేక‌ర్స్ కూడా శ్రీకాంత్ పై న‌మ్మ‌కంతో బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ఖ‌ర్చు పెడుతున్నార‌ని తెలుస్తోంది.

నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్న శ్రీకాంత్

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతుండ‌గా, శ్రీకాంత్ ఈసారి ది ప్యార‌డైజ్ సినిమాతో బెస్ట్ అవుట్‌పుట్ ను డెలివ‌రీ చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమాలోని సీన్స్, యాక్ష‌న్ ఎపిసోడ్స్, క్యారెక్ట‌ర్ల‌ను శ్రీకాంత్ నెక్ట్స్ లెవెల్ లో డిజైన్ చేశాడ‌ని, కాక‌పోతే షూటింగ్ ఇంకా చాలా భాగం ఉండ‌టం వ‌ల్ల అనౌన్స్ చేసిన డేట్ కు రిలీజ్ కాదేమో అని సందేహాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

డిసెంబ‌ర్ లో ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చే అవ‌కాశాలు

ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఓ వైపు సినిమా షూటింగ్ చేస్తూనే మ‌రోవైపు గ్యాప్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం చెన్నై వెళ్లొస్తున్నార‌ని తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ది ప్యార‌డైజ్ ఫ‌స్ట్ సింగిల్ ప్రొడ‌క్ష‌న్ లాస్ట్ స్టేజ్ లో ఉంద‌ని, డిసెంబ‌ర్ ఎండింగ్ లో లేదా జ‌న‌వ‌రి స్టార్టింగ్ లో ఈ ఫ‌స్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని, ది ప్యార‌డైజ్ నుంచి రిలీజ‌య్యే ఫ‌స్ట్ సింగిల్ సినిమాలో నాని క్యారెక్ట‌ర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ కొన‌సాగుతుందని స‌మాచారం. అయితే నాని ఫ్యాన్స్ మాత్రం సినిమా ఎంత లేటైనా ప‌ర్లేదు కానీ ఎప్పుడు రిలీజ్ చేసినా సినిమా గురించి అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుకునేలా అవుట్‌పుట్ ఉండాల‌ని చెప్తూ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ను ఎంక‌రేజ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.