Begin typing your search above and press return to search.

100 కోట్ల బిజినెస్.. నాని ఓపెనింగ్ టార్గెట్ ఆ లిస్ట్‌ను దాటేస్తుందా?

నాని కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో వస్తున్న 'ది ప్యారడైజ్' అంచనాలు మామూలుగా లేవు. ఈ ప్రాజెక్ట్ కోసమే మేకర్స్ వంద కోట్లకు పైగా ఖర్చు చేశారట.

By:  M Prashanth   |   22 Sept 2026 9:31 AM IST
100 కోట్ల బిజినెస్.. నాని ఓపెనింగ్ టార్గెట్ ఆ లిస్ట్‌ను దాటేస్తుందా?
X

నాని కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో వస్తున్న 'ది ప్యారడైజ్' అంచనాలు మామూలుగా లేవు. ఈ ప్రాజెక్ట్ కోసమే మేకర్స్ వంద కోట్లకు పైగా ఖర్చు చేశారట. కేవలం తెలుగు థియేట్రికల్ బిజినెస్ 103.7 కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. నాని కెరీర్లో ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్. పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు రికవరీ రావాలంటే మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ దద్దరిల్లాలి.

ఇప్పటివరకు నాని బెస్ట్ ఓపెనింగ్స్ రికార్డ్ దసరా, హిట్ 3 పేరిట ఉన్నాయి. ఈ రెండు సినిమాలు వరల్డ్ వైడ్ ఫస్ట్ డే దాదాపు 36 నుంచి 40 కోట్ల రేంజ్ వసూళ్లు రాబట్టాయి. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం 20 కోట్లకు పైగా ఓపెన్ అయింది. ప్యారడైజ్ 40 కోట్ల మార్క్ దాటితే నాని కెరీర్ బెస్ట్ అవుతుంది. ఒకవేళ 50 కోట్లు టచ్ చేస్తే అతడి స్టామినా అమాంతం పెరిగినట్లే.

అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ కాస్త సాలిడ్ గానే ఉంది. నైజాంలో ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఆరు లక్షల డాలర్లు దాటాయి. సెప్టెంబర్ 22 ఉదయం నాటికి ఇండియాలో మొదటి నాలుగు రోజుల ప్రీ సేల్స్ 7.8 కోట్లకు చేరాయని సాక్‌నిల్క్ నివేదికలు చెబుతున్నాయి. ఇంకా ఫుల్ గా షోస్ ఓపెన్ అయితే ఈ కౌంట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే ఈమధ్య కాలంలో 100 నుంచి 150 కోట్ల బడ్జెట్ రేంజ్‌లో వచ్చిన సినిమాల మొదటి రోజు వసూళ్లు గమనిస్తే నాని టార్గెట్ ఎంత కష్టమో అర్థమవుతుంది. ఒకే బడ్జెట్ రేంజ్ లో వచ్చిన ఆ సినిమాల లిస్ట్ ఒకసారి చూస్తే..

ఆచార్య: బడ్జెట్ రూ.140 కోట్లు - కలెక్షన్ రూ.51 కోట్లు

డాకు మహారాజ్: బడ్జెట్ రూ.100 కోట్లు - కలెక్షన్ రూ.41.24 కోట్లు

కింగ్‌డమ్: బడ్జెట్ రూ.120 కోట్లు - కలెక్షన్ రూ.35.1 కోట్లు

కుబేర: బడ్జెట్ రూ.120-150 కోట్లు - కలెక్షన్ రూ.27.21 కోట్లు

లైగర్: బడ్జెట్ రూ.101 కోట్లు - కలెక్షన్ రూ.24.3 కోట్లు

ఆచార్య, డాకు మహారాజ్ లాంటి సీనియర్ల ఓపెనింగ్స్ వేరు.. నాని మార్కెట్ వేరు.. కానీ ప్యారడైజ్ యాభై కోట్ల దగ్గరకు వెళితే అది సరికొత్త సంచలనమే అవుతుంది. కనీసం నలభై కోట్ల దగ్గర ఉన్నా పాత రికార్డులు బ్రేక్ అయినట్లే. బిజినెస్ వంద కోట్లు దాటిన నేపథ్యంలో ఫస్ట్ డే ఎంత రికవరీ వస్తుందన్నది బయ్యర్లకు చాలా కీలకం కాబోతోంది.

సెప్టెంబర్ 23 సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ మొదలవుతాయి. తెలంగాణలో ఈ షోలకు 500 రూపాయలు ధర ఉండగా, ఏపీలో మల్టీప్లెక్స్‌కు 400, సింగిల్ స్క్రీన్‌కు 300 వసూలు చేసుకునేలా జీవోలు వచ్చాయి. నార్త్ అమెరికాతో పాటు ఏపీలో కూడా స్క్రీన్స్ పెరగాల్సి ఉంది. ఈ ప్రీమియర్స్ పూర్తయ్యేసరికి నాని 40 కోట్ల దగ్గర ఆగుతాడా లేక 50 కోట్లు టచ్ చేస్తాడా అనేది తేలిపోతుంది.