నేచురల్ స్టార్ ని ఇంకా అలా పిలవడం ధర్మమేనా?
నేచురల్ స్టార్ నాని ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 18 ఏళ్లగా చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.
By: Srikanth Kontham | 7 Feb 2026 11:00 PM ISTనేచురల్ స్టార్ నాని ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 18 ఏళ్లగా చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. నేచురల్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్, మహేష్ ల తర్వత అత్యంత లేడీ ఫాలోయింగ్ కలిగిన నటుడు. `అష్టా చెమ్మా` నుంచి `హిట్ ది థర్డ్ కేస్` వరకూ నాని ప్రయాణం ఎంతో వైవిథ్యమైనది. రెగ్యులర్ కమర్శియల్ చిత్రాల్లో నటిస్తూనే? ప్రయోగాలకు వెనుకాడని నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. పెర్పార్మెన్స్ ఓరియేంటెడ్ పాత్రలకు పెట్టింది పేరుగా దశాబ్దంన్నర కాలంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.
నాని సినిమాల బిజినెస్ భారీ ఎత్తున జరుగుతోంది. కథకు తగ్గట్టు బడ్జెట్ కూడా భారీగా పెరిగింది. గడిచిన ఐదేళ్ల సినిమాల బడ్జెట్...జరిగిన బిజినెస్ చూస్తే ఈ విషయం అర్దమవుతుంది. నాని నటనని ప్రశంసించని స్టార్ అంటూ ఉండరు. టాలీవుడ్ లో ప్రతీ స్టార్ హీరో నాని ఎంతో ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు. అతడి స్టోరీ సెలక్షన్ ని మెచ్చు కుంటారు. నాని లాంటి పాత్రలు తాము చేయాలని కోరుకుంటారు. ఇంతటి ఖ్యాతి గడించిన నాని ఇంకా టైర్ 2 హీరోనేనా? అంటే కొందరు ఇంకా నాని ని అలాగే పరి గణిస్తున్నారు. టైర్ వన్ హీరోల జాబితాలో చేర్చ లేకపోతున్నారు.
మహేష్, రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్లకు ధీటుగా నానిని చూడలేకపోతున్నారు. టైర్ 2 స్టార్ గా ప్రోజెక్ట్ చేసే ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. నానికి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇంతింతై వటుడింతైన చందంగా స్టార్ గా ఎదిగాడు. దర్శకుల ఆలోచనల్ని, విజన్ ని ఒడిసిపట్టుకుని తనని తానే స్టార్ గా మార్చుకున్నాడు. నాని సాధించిన విజయాల లోతుల్లోకి వెళ్తే `దసరా` తో 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. ఆ సినిమా లాంగ్ రన్ లో 120 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఆ తర్వాత నటించిన `హాయ్ నాన్న` 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అనంతరం `సరిపోదా శనివారం`తో మరోసారి సెంచరీ కొట్టాడు. అటుపై శైలేష్ కొలనుతో పని చేసిన `హిట్ ది థర్డ్ కేస్` రెండ వసారి వందకోట్ల కబ్లో లే చేరాడు. ప్రస్తుత `ది ప్యారడైజ్` లో నటిస్తున్నాడు. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న చిత్రం. ఈ సినిమా బడ్జెట్ కూడా వందల కోట్లగా తెలుస్తోంది. ఈ సినిమాకు పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతోంది. అలాగే సుజిత్ తో కూడా ఓ పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయ్యాడు. మరి ఇప్పటికైనా టైర్ 2 గా భావించే వారంతా? నేచురల్ స్టార్ ని టైర్ వన్ లో వేస్తారేమో చూడాలి.
