Begin typing your search above and press return to search.

టైర్‌ 2 హీరోల్లో నాని నెంబర్‌.1

టాలీవుడ్‌లో ప్రస్తుతం మూడు తరాల హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేయడం ద్వారా బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతున్నారు.

By:  Ramesh Palla   |   3 April 2026 12:10 PM IST
టైర్‌ 2 హీరోల్లో నాని నెంబర్‌.1
X

టాలీవుడ్‌లో ప్రస్తుతం మూడు తరాల హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేయడం ద్వారా బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతున్నారు. ఈ సీనియర్‌ స్టార్స్‌లో చిరంజీవి నెం.1 స్థానంలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇక టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ తదితరులు ప్రస్తుతం ఇండస్ట్రీని శాసిస్తున్నారు. వీరు తమ ప్రతి సినిమాతోనూ వందల కోట్ల వసూళ్లు రాబట్టడం మనం చూస్తున్నాం. వీరికి బలమైన ఫ్యాన్‌ బేస్ ఉంది. వీరి సినిమాల టాక్‌ తో సంబంధం లేకుండా మినిమం వసూళ్లు నమోదు కావడం, భారీ ఓటీటీ మార్కెట్‌ కావడం మనం చూస్తూ ఉంటాం. అయితే టైర్ 2 హీరోల విషయంలో పూర్తి విభిన్నంగా ఉంటుంది. టైర్ 2 హీరోల సినిమాలకు పాజిటివ్‌ టాక్ వస్తే తప్ప బిజినెస్ జరగదు, వసూళ్లు రావు.

టాలీవుడ్‌ టైర్‌ 2 హీరోల్లో...

టైర్‌ 2 హీరోల్లో ఈ మధ్య ఎక్కువగా ఫెయిల్యూర్స్ చవిచూస్తున్న వారు ఉన్నారు. టాలీవుడ్‌లో టైర్ 2 హీరోల జాబితాలో నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, సాయి ధరమ్‌ తేజ్‌, రామ్‌, అడవి శేష్‌, శర్వానంద్‌, సిద్దు, నవీన్‌, వరుణ్‌ తేజ్‌ తదితరులు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది వరుస ఫెయిల్యూర్స్‌ తో సతమతం అవుతున్నారు. ఒక్క హిట్‌ కొడితే మళ్లీ హిట్‌ కొట్టడానికి ఏళ్లకు ఏళ్లు వెయిట్‌ చేయాల్సి వస్తుంది. ఈ టైర్ 2 హీరోల్లో వంద కోట్ల మార్కెట్‌ ను సాధించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. టైర్‌ 2 హీరోల్లో స్థిరంగా సినిమాలు చేస్తూ, ప్రతి సినిమాతో మినిమం వసూళ్లు రాబడుతూ, ఓటీటీ మార్కెట్‌లోనూ టాప్‌లో ఉన్న హీరో నాని. ఈయన గత ఐదు సంవత్సరాలుగా చేసిన సినిమాలన్నీ కూడా మినిమం నుంచి భారీ వసూళ్లు సాధించాయి. అంతే కాకుండా ఓటీటీ ద్వారా కూడా ఈయన నిర్మాతలకు భారీగానే డబ్బులు తెచ్చి పెట్టాడు.

నాని సినిమాల వసూళ్లు...

నాని సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలవుతుంది. మినిమం మ్యాటర్‌ ఉంటుందనే ఉద్దేశంతో సినిమా టాక్‌ రాకముందే థియేటర్‌కి వెళ్లేందుకు ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు. స్టార్‌ హీరోల సినిమాలకు, సీనియర్‌ స్టార్‌ హీరోల సినిమాలకు ఎలా అయితే బేసిక్ ఫుట్‌ పాల్స్ ఉంటున్నాయో అలాగే నాని సినిమాకు సైతం మినిమం ఓపెనింగ్ రావడం, సినిమా విడుదల తర్వాత పాజిటివ్‌ టాక్‌ వస్తే భారీ వసూళ్లు నమోదు కావడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే టైర్ 2 హీరోల్లో కచ్చితంగా నాని నెం.1 అంటూ ఆయన అభిమానులు లెక్కలు చూపిస్తూ మరీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం నాని చేస్తున్న ది ప్యారడైజ్‌ సినిమాకు ఉన్న బజ్‌ ను చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. చాలా మంది టైర్‌ 2 హీరోల సినిమాలకు విడుదలకు ముందు ఎంత బజ్ క్రియేట్‌ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు, కానీ నాని సినిమాకు ఈజీగా బజ్ క్రియేట్‌ అవుతూ ఉంటుంది.

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల ది ప్యారడైజ్‌ మూవీ...

ది ప్యారడైజ్ సినిమాతో నాని మరోసారి తన కొత్త యాంగిల్‌ను చూపించబోతున్నాడు. దసరా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న ది ప్యారడైజ్‌ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్య కాలంలో ఓటీటీ మార్కెట్‌ డల్‌గా ఉందనే విషయం తెల్సిందే. అయినా కూడా ఈ సినిమాకు ఓటీటీ బిజినెస్ ఇప్పటికే జరిగిందని, అది కూడా భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ కొనుగోలు చేసిందని నిర్మాత నుంచి సమాచారం అందుతోంది. నాని తన ప్రతి సినిమాకు చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా కొత్త తరహా కథలను చెప్పడం కోసం చాలా కష్టపడే నాని టైర్ 2 హీరోల్లో నెం.1 స్థానం ను సొంతం చేసుకున్నాడు. నాని ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు సైతం లైన్‌ లో ఉన్నాయి. స్థిరంగా సక్సెస్‌లను దక్కించుకోవడంతో పాటు, వరుస సినిమాలు చేయడం ద్వారా నాని ఎప్పుడూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు. ఇతర టైర్‌ 2 హీరోలు స్థిరంగా సినిమాలు చేయక పోవడంతో ప్రేక్షకులు వారిపై ఆసక్తి కనబర్చడం లేదు.