Begin typing your search above and press return to search.

హాయ్ నాన్న డైరెక్టర్.. వెయిటింగ్ తప్పదా..?

ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెల దసరా తర్వాత మళ్లీ నానితోనే ది ప్యారడైజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఆ లిస్ట్ లో హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ ఉన్నట్టు తెలుస్తుంది.

By:  Ramesh Boddu   |   26 Sept 2025 12:00 PM IST
హాయ్ నాన్న డైరెక్టర్.. వెయిటింగ్ తప్పదా..?
X

టాలీవుడ్ కి టాలెంటెడ్ డైరెక్టర్స్ ని పరిచయం చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. అదేంటో వేరే వాళ్లకు నానిలా ఎందుకు సాధ్యపడట్లేదు అన్నది తెలియదు కానీ.. ఎవరైనా కొత్త దర్శకుడు కథ చెప్పగానే నాని తన ఇన్ పుట్స్ ఇచ్చి ఆ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెలతో దసరానే కాదు శౌర్యువ్ తో హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ సినిమాను కూడా నాని జడ్జ్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. తొలి సినిమా నానితో తీసి సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్ నెక్స్ట్ సినిమా కూడా నానినే కావాలని అంటున్నారు.

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా..

ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెల దసరా తర్వాత మళ్లీ నానితోనే ది ప్యారడైజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఆ లిస్ట్ లో హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ ఉన్నట్టు తెలుస్తుంది. హాయ్ నాన్న సినిమాతో నానికి ఒక సూపర్ ఎమోషనల్ రైడ్ లాంటి మూవీ ఇచ్చాడు శౌర్యువ్. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత శౌర్యువ్ అసలైతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సినిమా చేస్తాడన్న డిస్కషన్ నడిచింది కానీ అదేమి జరగలేదు.

ఐతే హాయ్ నాన్న డైరెక్టర్ తన సెకండ్ మూవీ కూడా నానితో చేయాలని ఫిక్స్ అయ్యాడు. నాని ది ప్యారడైజ్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఓజీ డైరెక్టర్ సుజిత్ తో నాని సినిమా లైన్ లో ఉంది. ఓజీ రిలీజ్ హంగామాలో ఉన్న సుజిత్. ఈ బజ్ పూర్తయ్యాక ఆ సినిమా మొదలు పెడతాడు. ఒకవేళ శౌర్యువ్ కథ నచ్చినా కూడా నాని కోసం ఎలా లేదన్నా ఏడాది దాకా వెయిట్ చేయక తప్పదు.

శౌర్యువ్ ఇమేజ్ ని కాపాడుకుంటే..

మరి నాని కోసం రెందేళ్లు శౌర్యువ్ వెయిట్ చేస్తాడా లేదా మరొక హీరోకి వెళ్తాడా అన్నది చూడాలి. శౌర్యువ్ ఫస్ట్ సినిమాతోనే తన డైరెక్షన్ టాలెంట్ చూపించాడు కాబట్టి అతనితో యువ హీరో చేసినా సరే అదే రేంజ్ రిజల్ట్ ఆశిస్తారు. మరి శౌర్యువ్ఆ ఇమేజ్ ని కాపాడుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. నాని శౌర్యువ్ ప్రాజెక్ట్ లేట్ అవ్వొచ్చేమో కానీ ఈసారి ఈ కాంబినేషన్ సినిమా కూడా వేరే లెవెల్ ప్లానింగ్ ఉందట. నాని కోసం తన డైరెక్టర్స్ అంతా కూడా మళ్లీ అద్భుతమైన కథలతో వస్తున్నారు. నాని తో శ్రీకాంత్, శౌర్యువ్ రెడీ అవుతుండగా మిగతా డైరెక్టర్స్ కూడా నాని కోసం పోటీ పడుతున్నారు.