Begin typing your search above and press return to search.

ఫీల్ గుడ్ డైరెక్టర్ తో నాని.. సెట్టయితే క్లాసిక్ గ్యారెంటీ!

నాచురల్ స్టార్ ఇప్పుడు కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. మీడియం రేంజ్ నుంచి అంతకుమించి అనేలా కొనసాగుతున్నాడు. తన మార్కెట్ ను కూడా పెంచుకుంటున్నారు.

By:  M Prashanth   |   2 Dec 2025 8:00 AM IST
ఫీల్ గుడ్ డైరెక్టర్ తో నాని.. సెట్టయితే క్లాసిక్ గ్యారెంటీ!
X

నాచురల్ స్టార్ ఇప్పుడు కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. మీడియం రేంజ్ నుంచి అంతకుమించి అనేలా కొనసాగుతున్నాడు. తన మార్కెట్ ను కూడా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం లైనప్ చూస్తే అంతా భారీ బడ్జెట్, మాస్, యాక్షన్ సినిమాలే కనిపిస్తున్నాయి. కానీ సడెన్ గా ఆయన ట్రాక్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం ఒక సెన్సిబుల్ డైరెక్టర్ తో చేతులు కలపడానికి నాని రెడీ అవుతున్నారట.

నాని కథల ఎంపిక చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఫోకస్ పక్క రాష్ట్రం మీద పడింది. తమిళంలో అద్భుతమైన ఎమోషనల్ సినిమాలు తీసే ఒక దర్శకుడితో నాని చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు తీసిన గత సినిమాలు చూస్తే మనసుకు హత్తుకునేలా, కంటతడి పెట్టించేలా ఉంటాయి. నాని కూడా ఆ డైరెక్టర్ పనితనానికి తాను వీరాభిమానిని అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు.

ఇంతకీ ఆ దర్శకుడు మరెవరో కాదు, '96' లాంటి క్లాసిక్ ప్రేమకథను అందించిన ప్రేమ్ కుమార్. ఇటీవల కార్తీ, అరవింద్ స్వామి కాంబినేషన్ లో వచ్చిన 'సత్యం సుందరం' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా చూసి ఫిదా అయిన నాని, రీసెంట్ గా ప్రేమ్ కుమార్ ను కలిసి ఒక స్టోరీ లైన్ విన్నారట. ఆ ఐడియా నానికి బాగా నచ్చిందట.

ప్రేమ్ కుమార్ చెప్పిన ఆ పాయింట్ కు నాని ఫార్మల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే నాని ఓకే చెప్పినా, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక సుజీత్ తో ఒక భారీ యాక్షన్ డ్రామా చేయాల్సి ఉంది. ఈ రెండు పెద్ద ప్రాజెక్టులు పూర్తయితే గానీ కొత్త సినిమా మొదలవ్వదు.

మరోవైపు దర్శకుడు ప్రేమ్ కుమార్ కూడా ఖాళీగా లేరు. ఆయన తదుపరి సినిమా చియాన్ విక్రమ్ తో ఉండబోతోందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే ఆయనకు వేరే నిర్మాతలతో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇద్దరి డేట్స్ కుదిరి, ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే కనీసం 2026 చివర వరకు ఆగాల్సిందే. కానీ ఈ కాంబో మాత్రం కచ్చితంగా ఉంటుందని కోలీవుడ్ వర్గాల టాక్.

వరుసగా యాక్షన్, వయోలెన్స్ సినిమాలు చేస్తున్న నాని, మధ్యలో ఇలాంటి కూల్ అండ్ ఎమోషనల్ సినిమా చేస్తే ఆడియెన్స్ కు మంచి రిలీఫ్ దొరుకుతుంది. 'జెర్సీ', 'హాయ్ నాన్న' లాంటి సినిమాల్లో నాని నటన ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రేమ్ కుమార్ లాంటి దర్శకుడితో కలిస్తే మరో క్లాసిక్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.