నాని షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్..ది ప్యారడైస్ లుక్‌తో ఆశ్చర్యపరుస్తున్న నేచురల్ స్టార్..!
నేచురల్ స్టార్ నాని మరోసారి ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేశాడు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ది ప్యారడైస్ కోసం నాని చేసిన మేకోవర్ ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
By: Priya Chowdhary Nuthalapti | 1 March 2026 10:56 PM ISTనేచురల్ స్టార్ నాని మరోసారి ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేశాడు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ది ప్యారడైస్ కోసం నాని చేసిన మేకోవర్ ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇటీవల నాని జిమ్‌లో తీసుకున్న కొత్త ఫోటోలు విడుదల చేయగా..అవి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో నాని పూర్తిగా భిన్నంగా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన నానికీ..ఈ సినిమాలో కనిపించే నానికీ చాలా తేడా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపింది. కండలు తిరిగిన శరీరం, రగ్డ్ లుక్‌తో ఆయన అందరినీ ఆశ్చర్యపరచబోతున్నారని ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇప్పటికే అర్థమయిపోయి ఉంటుంది.

ఈ లుక్ కోసం నాని ప్రొఫెషనల్ ట్రైనర్‌ను తీసుకుని, కఠినమైన వ్యాయామాలు చేశాడంట. అంతేకాదు, తన ఆహార నియమాలను కూడా పూర్తిగా మార్చుకున్నారు. రోజూ గంటల కొద్దీ జిమ్‌లో వర్కౌట్ చేసి, శరీరాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ మేకోవర్ వెనుక ప్రధాన కారణం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆయన రాసిన పవర్ ఫుల్ కథకు, పాత్రకు దృఢమైన శారీరక రూపం అవసరమని భావించారు. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన దసరా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకన్నా పెద్ద స్థాయిలో..మరింత పవర్ ఫుల్ పాత్రతో ‘ది ప్యారడైస్’ తెరకెక్కుతోంది.
ఇటీవల విడుదలైన “ఆయా షేర్” అనే పాటలో నాని కొత్త రూపం కొంత కనిపించింది. ఆ పాటలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఈ సినిమాలో నాని చేస్తున్న ‘జడాల్’ పాత్ర సాధారణ యాక్షన్ పాత్ర కాదు. ఇది ప్రేక్షకులను ఆశ్చర్యానికి, షాక్‌కు గురి చేసేలా ఉంటుందని సమాచారం.
ఈ సినిమాకు సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘ది ప్యారడైస్’ 21 ఆగస్టు 2026న ఇండియా సహా అంతర్జాతీయ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేకోవర్‌తో నాని మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ఖాయం.
