Begin typing your search above and press return to search.

జ‌డ‌ల్ దెబ్బ కు అబ్బ గుర్తొచ్చేలా!

ప్ర‌స్తుతం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో `ది ప్యార‌డైజ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   8 Dec 2025 6:00 PM IST
జ‌డ‌ల్ దెబ్బ కు అబ్బ గుర్తొచ్చేలా!
X

`ద‌స‌రా`, `హిట్ 3` లాంటి విజ‌యాల‌ త‌ర్వాత నేచుర‌ల్ నాని పై మాస్ అనే ట్యాగ్ ప‌డింది. అంత వ‌ర‌కూ క్లాసిక్ రోల్స్ పోషించిన నాని ఒక్క‌సారిగా రా ర‌స్టిక్ పాత్ర‌ల్లో క‌నిపించే స‌రికి? ప్రేక్ష‌కులు కొత్త అనుభూతికి లోన‌య్యారు. ఇలాంటి పాత్ర‌ల‌కు కూడా నాని ప‌ర్పెక్ట్ గా యాప్ట్ అవుతాడ‌ని పెర్పార్మెన్స్ తో ప్రూవ్ చేసాడు. ఈ విష‌యం లో నాని ప్రేక్ష‌కుల ప‌ల్స్ ను క‌నిపెట్ట‌గ‌లిగాడు. అందుకు త‌గ్గ‌ట్టే త‌దుప‌రి చిత్రాలు కూడా అదే త‌ర‌హాలో ఉండేలా ప్లాన్ చేసుకుని బ‌రిలోకి దిగుతున్నాడు. ప్ర‌స్తుతం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో `ది ప్యార‌డైజ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

సినిమాకే హైలైట్ గా ఆ స‌న్నివేశం:

`ద‌స‌రా` త‌ర్వాత ఇద్ద‌రు మ‌రోసారి చేతులు క‌లిపారు. ఇదీ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. ద‌స‌రా కు రెండిత‌లు యాక్ష‌న్ ప్యార‌డైజ్ లో ఉంటుంది. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతుంది. సినిమాలో నాని జ‌డ‌ల్ అనే ప‌వ‌ర్ పుల్ రా ర‌స్టిక్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. తాజాగా హైద‌రాబాద్లో ఓ భారీ సెట్ లో యాక్ష‌న్ స‌న్ని వేశం చిత్రీక రిస్తున్నారు. నాని-రాఘ‌వ్ తో పాటు కొంద‌రు ఫైట‌ర్లు ఈ యాక్ష‌న్ సీన్ లో పాల్గొంటున్నారు. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇంత వ‌ర‌కూ ఈ రేంజ్ యాక్ష‌న్ స‌న్నివేశం ఏ హీరో? ఏ సినిమాలో చేయ‌లేద‌ని..ఎంతో క్రియేటివ్ గా యాక్ష‌న్ సన్నివేశం డిజైన్ చేసిన‌ట్లు స్టంట్ మాస్ట‌ర్లు చెబుతున్నారు.

రిలీజ్ పై క్లారిటీ ఎప్పుడు?

మరి నాని ఈ యాక్ష‌న్ సీన్ కోసం ప్ర‌త్యేకంగా స‌న్న‌ద్ద‌మ‌య్యాడా? అన్న‌ది తెలియాలి. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొద‌లైన నాటి నుంచి శ్రీకాంత్ అన్ని విష‌యాలు గోప్యంగానే ఉంచుతున్నాడు. చిత్రీక‌ర‌ణ ముగింపు దశ‌కు చేరుకున్నా? ఎలాంటి విష‌యాలు రివీల్ చేయ‌డం లేదు. అలాగే ఆన్ సెట్స్ నుంచి ఎలాంటి లీకులు బ‌య‌ట‌కు రాలేదు. స్ట్రిక్ట్ రూల్స్ తో షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు. తాజా షెడ్యూల్ తో షూటింగ్ కూడా ముగింపు ద‌శ‌కు చేరుకుంటుంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. అలాగే సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తామ‌న్న‌ది కూడా ఇంకా వెల్ల‌డించ‌లేదు.

ఆర్ ఆర్ కూడా కీల‌క‌మే:

వ‌చ్చే ఏడాది ద్వితియార్దంలో రిలీజ్ కు అవ‌కాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల‌కు స‌మ‌యం ప‌డుతుంది. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా కాబ‌ట్టి విజువ‌ల్ ఎఫెక్స్ట్ ప‌నులకు స‌మ‌యం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ కూడా రిలీజ్ తేదీపై ఓ అంచ‌నాకి రాలేక‌పోతున్నారు. అనిరుద్ సంగీతం తోనూ మ‌రోసారి మ్యాజిక్ చేయ‌డం ఖాయంగా చెప్పొచ్చు. ఇలాంటి క‌థ‌ల‌కు ఆర్ ఆర్ కీల‌కం. ఈ విష‌యంలో మేకర్స్ కి ఎలాంటి టెన్ష‌న్ అవ‌స‌రం లేదు. అందులో ది బెస్ట్ ఇవ్వ‌గ‌ల‌డు ఈ యువ సంచ‌ల‌నం.