Begin typing your search above and press return to search.

నాని.. ఈ ఛాన్స్ యూజ్ చేసుకుంటారా?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇప్పుడు కెరీర్ లో దూసుకుపోతున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వరుస హిట్స్ తో సత్తా చాటుతున్నారు.

By:  M Prashanth   |   25 Feb 2026 10:02 PM IST
నాని.. ఈ ఛాన్స్ యూజ్ చేసుకుంటారా?
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇప్పుడు కెరీర్ లో దూసుకుపోతున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వరుస హిట్స్ తో సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన కెరీర్ కీలక మలుపు తిరిగే సమయం వచ్చిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో పలువురు తెలుగు హీరోలు సత్తా చాటుతుండగా.. ఇప్పుడు నానికి కూడా సరైన ఛాన్స్ వచ్చిందని అంతా మాట్లాడుకుంటున్నారు.

నిజానికి.. ప్రభాస్, అల్లు అర్జున్ వంటి పలువురు స్టార్ హీరోలు బాలీవుడ్ మార్కెట్‌ లో భారీ వసూళ్లు సాధిస్తూ తమ మార్కెట్‌ ను పెంచుకుంటున్నారు. అలాగే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. దీంతో తెలుగు సినిమాలకు హిందీ బెల్ట్‌ లో మంచి క్రేజ్ ఏర్పడింది. నాని కూడా గతంలో హిందీ డబ్బింగ్ వెర్షన్లతో నార్త్ లో తన లక్ ను టెస్ట్ చేసుకున్నారు.

బాలీవుడ్ లో దసరా, హాయ్ నాన్న, హిట్ 3 వంటి చిత్రాలు విడుదలైనా.. ఆశించిన స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేయలేకపోయాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాట సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకుల నుంచి కూడా ఆ పాటకు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది.

జాల్ హ్యాష్‌ ట్యాగ్‌ తో ట్రెండింగ్‌ లోకి రావడంతో వ్యూస్ భారీగా పెరుగుతున్నాయి. దీంతో నేషనల్ వైడ్ గా సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే ఆ బజ్‌ ను సరిగ్గా ఉపయోగించుకుంటే నానికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్‌ గా మారే అవకాశం ఉందని చెప్పాలి. బాలీవుడ్ మార్కెట్‌ లో సరైన ప్రమోషన్లు, స్ట్రాటజిక్ రిలీజ్ ప్లాన్, మాస్ ఆడియన్స్‌ ను టార్గెట్ చేసే మార్కెటింగ్ చేస్తే సినిమా మంచి వసూళ్లు సాధించగలదు.

అంతేకాకుండా బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ డిస్ట్రిబ్యూటర్స్ ప్యారడైజ్ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సినిమాకు మరింత ప్లస్ పాయింట్ గా మారనుంది. అలా ఇప్పటివరకు ప్రభాస్, బన్నీ తప్ప ఇతర తెలుగు హీరోలు సోలోగా బాలీవుడ్‌ లో భారీ సక్సెస్ సాధించలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నాని తన ఛాన్స్ ను యూజ్ చేసుకుంటే ఆయన కెరీర్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.

ముఖ్యంగా స్టోరీ సెలెక్షన్, యాక్టింగ్, కంటెంట్‌ విషయంలో నాని తీసుకునే జాగ్రత్తలు.. ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. ఏదేమైనా ది ప్యారడైజ్ మూవీ ద్వారా నాని బాలీవుడ్ మార్కెట్‌ లో సరైన ప్లేస్ సొంతం చేసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. సరైన ప్లానింగ్‌ తో ముందుకు వెళ్తే, నేచురల్ స్టార్ కూడా పాన్ ఇండియా స్టార్‌ గా మారడం ఖాయమని అంతా అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?