Begin typing your search above and press return to search.

హిట్ 4లో కూడా నాని సర్ ప్రైజ్..?

నాని హిట్ 4 లో ఉంటే ఆ సినిమాకు స్పెషల్ బూస్ట్ వస్తుంది. కార్తి ప్రస్తుతం సర్ధార్ 2 తో పాటు మరో సినిమా చేస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   27 Aug 2025 9:31 AM IST
హిట్ 4లో కూడా నాని సర్ ప్రైజ్..?
X

న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా అదరగొట్టేస్తున్నాడు. ప్రశాంత్ వర్మతో అ! తో మొదలైన నాని ప్రొడక్షన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. నాని హిట్ సీరీస్ లు అయితే ఆడియన్స్ కి సూపర్ ఎంగేజ్ అవుతున్నాయి. హిట్ 3 సినిమాలో తానే హీరోగా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు నాని. ఐతే హిట్ 3 చివర్లోనే హిట్ 4 హీరోని రివీల్ చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి హిట్ 4లో నటిస్తున్నాడు. ఐతే హిట్ 4 లో డైరెక్ట్ శైలేష్ చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

హిట్ 4 విజువల్ ట్రీట్..

హిట్ 4 సినిమాలో నాని కూడా సర్ ప్రైజ్ చేస్తాడట. ఎలా అయితే మిషన్ సక్సెస్ చేయడానికి సరైన టైం లో మరో ఆఫీసర్ వస్తాడో. అలా హిట్ 4లో నాని కార్తి ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తారట. తప్పకుండా ఇది విజువల్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. తెలుగు, తమిళ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అందులోనూ స్టార్స్ గా తమని తాము ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న కార్తి, నాని లాంటి వాళ్లు కలిసి నటిస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది.

నాని హిట్ 4 లో ఉంటే ఆ సినిమాకు స్పెషల్ బూస్ట్ వస్తుంది. కార్తి ప్రస్తుతం సర్ధార్ 2 తో పాటు మరో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలు పూర్తి చేసి హిట్ 4 కి టైం ఇవ్వనున్నాడు. కచ్చితంగా హిట్ 4 తో తెలుగు ఆడియన్స్ ని కూడా కార్తి సర్ ప్రైజ్ చేస్తాడని చెప్పొచ్చు. ఇక నాని విషయానికి వస్తే ప్రస్తుతెం ది ప్యారడైజ్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు నాని. ఆ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సినిమా ఉంది.

ది ప్యారడైజ్ సినిమా..

సుజిత్ తో తను చేసే ప్రాజెక్ట్ ని డివివి దానయ్య నిర్మాణంలో జరుగుతుంది. నాని ది ప్యారడైజ్ సినిమా 2026 మార్చి 27న రిలీజ్ లాక్ చేశారు. అనుకున్న టైం కు సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ది ప్యారడైజ్ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ తో పాటు నాని పాత్ర పేరు చెబుతూ మరో గ్లింప్స్ కూడా వచ్చింది. ఐతే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ ఎవరన్నది ఇప్పటివరకు రివీల్ చేయలేదు.