Begin typing your search above and press return to search.

మాస్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా నాని!

ది ప్యారడైజ్ సినిమాలో నాని జడల్ అనే ఇంటెన్స్, మాస్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 Sept 2026 10:00 PM IST
మాస్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా నాని!
X

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ టైమ్ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేశారు. అయితే ఈ ప్రమోషన్స్‌లో సినిమా కథ, యాక్షన్ సీన్స్, క్యారెక్ట‌ర్ల గురించి మాత్రమే కాకుండా.. నాని వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. తాజాగా యాంకర్ ప్రదీప్ తో మేక‌ర్స్ ప్లాన్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో నాని చెప్పిన ఓ చిన్న మాట ఇప్పుడు ఆయన స్క్రీన్ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన కోణాన్ని చూపిస్తోంది.

ది ప్యారడైజ్ సినిమాలో నాని జడల్ అనే ఇంటెన్స్, మాస్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆ క్యారెక్ట‌ర్‌లోని రఫ్‌నెస్, యాక్షన్ యాంగిల్‌ను హైలైట్ చేసింది. దీంతో నానిని చూస్తే ఓ కఠినమైన మాస్ క్యారెక్టర్ గుర్తుకు రావడం సహజం. కానీ ఇదే నాని యానిమేషన్ సినిమాలు చూస్తూ ఎమోష‌న‌ల్ అవుతాన‌ని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. కుంగ్‌ఫు పాండా చూసి కూడా తాను ఏడుస్తాన‌ని నాని చెప్పడం, ఆయనలోని మరో సైడ్‌ను బయటపెట్టింది.

ఇక్కడే నాని స్క్రీన్ ఇమేజ్‌కు, రియల్ పర్సనాలిటీకి మధ్య ఉన్న కాంట్రాస్ట్ ఆసక్తిని కలిగిస్తోంది. తెరపై ఎంత ఇంటెన్స్‌గా కనిపించినా, ప‌ర్స‌న‌ల్ గా మాత్రం చిన్న విషయాలకూ కనెక్ట్ అయ్యే సున్నితమైన మనసు తనలో ఉందని నాని చెప్పకనే చెప్పారు. ఒకవైపు యాక్షన్, మాస్ ఎలివేషన్స్‌తో నడిచే జడల్ క్యారెక్ట‌ర్.. మరోవైపు యానిమేషన్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకునే నాని.. ఈ రెండు విభిన్న కోణాలే నటుడిగా నాని జ‌ర్నీలో ఉన్న ఆసక్తికరమైన అంశాన్ని గుర్తుచేస్తున్నాయి.

వాస్త‌వానికి నాని సినిమాల ఎంపికలో కూడా ఈ సున్నితత్వం తరచూ కనిపిస్తూనే ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న కథలకు ఆయన ప్రాధాన్యతనివ్వడం తెలిసిందే. ది ప్యారడైజ్ విషయంలోనూ కేవలం మాస్ యాక్షన్‌నే కాకుండా ఎమోష‌న్స్ కు కూడా ప్రాధాన్యత ఉందనే చర్చకు ఈ తాజా కామెంట్ మరో కారణంగా మారింది. స్క్రీన్ పై ఎంత మాస్‌గా కనిపించినా.. ఆ క్యారెక్ట‌ర్ వెనుక ఉండే నటుడిలో మాత్రం చిన్నపిల్లాడి మనసు ఉందనే విషయాన్ని నాని మాట‌లు బయటపెట్టాయి. జడల్‌గా నాని ఎంత కఠినంగా కనిపిస్తాడో.. సినిమాలో అతని ఎమోషనల్ సైడ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 24 వరకు వేచి చూడాల్సిందే.