Begin typing your search above and press return to search.

ఇదంతా నా వ‌ల్లే అంటూ అర్థ‌రాత్రి లేచి మ‌రీ సారీ చెప్పాడు

అటు హీరోగా, ఇటు నిర్మాత‌గా వ‌రుస సినిమాల‌తో స‌క్సెస్ లు అందుకుంటూ దూసుకెళ్తున్నారు నేచుర‌ల్ స్టార్ నాని.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Sept 2025 3:53 PM IST
ఇదంతా నా వ‌ల్లే అంటూ అర్థ‌రాత్రి లేచి మ‌రీ సారీ చెప్పాడు
X

అటు హీరోగా, ఇటు నిర్మాత‌గా వ‌రుస సినిమాల‌తో స‌క్సెస్ లు అందుకుంటూ దూసుకెళ్తున్నారు నేచుర‌ల్ స్టార్ నాని. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ నాని త‌న ఫ్యామిలీకు స‌రైన స‌మ‌యాన్ని కేటాయిస్తూ వారితో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్స్ కు వెళ్ల‌డ‌మే కాకుండా వాటికి సంబంధించిన ఫోటోల‌ను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేస్తూంటారు నాని.

జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా షోకు గెస్టుగా నాని

రీసెంట్ గా ఫ్యామిలీ తో క‌లిసి వినాయ‌క చ‌వితిని సెల‌బ్రేట్ చేసుకున్న నాని, ఓ వీడియోను పోస్ట్ చేయ‌గా ఆ వీడియోలో నాని కొడుకు అర్జున్ శ్లోకాలు చ‌దువుతూ క‌నిపించారు. నాని కొడుకు అర్జున్ ముద్దు పేరు జున్ను. ఇంట్లో అంద‌రూ అర్జున్ ను అలానే పిలుస్తార‌ట. అయితే ఇటీవ‌ల‌ జున్ను కాలికి దెబ్బ తగ‌లి ఫ్రాక్చ‌ర్ అయిన‌ట్టు నాని జ‌గ‌ప‌తిబాబు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా టాక్ షో లో తెలిపారు.

పిల్ల‌ల‌కేమైనా అయితే వారి ఫేస్ చూడ‌లేం

సంవ‌త్స‌రం కింద‌ట‌ జున్ను కాలికి ఫ్రాక్చ‌ర్ అయింద‌ని, సైకిల్ మీద నుంచి ప‌డి బోన్ ఫ్రాక్చ‌ర్ అయింద‌ని, కద‌ల‌డానికి కూడా లేకుండా అయింద‌ని, కాలు కొంచెం జ‌రిపినా నొప్పి అనేవాడ‌ని, బాత్‌రూమ్ కి కూడా తామే తీసుకెళ్లేవాళ్ల‌మ‌ని, పిల్ల‌ల‌కు ఏమైనా అయిన‌ప్పుడు వాళ్ల ఫేస్ చూడ‌లేమ‌ని, చాలా బాధ అనిపిస్తుంద‌ని నేచుర‌ల్ స్టార్ నాని చెప్పుకొచ్చారు.

అర్థ‌రాత్రి లేచి ఏడ్చేవాడు

ఒక్కోసారి అర్థ‌రాత్రి నిద్ర లేచి నొప్పిగా ఉంద‌ని ఏడ్చేవాడ‌ని, ఆ టైమ్ లో త‌న‌కు, త‌న భార్య‌కు స‌రిగ్గా నిద్ర కూడా ఉండేది కాద‌ని, ఒక రోజు అర్థ‌రాత్రి జున్ను స‌డెన్ గా నిద్ర లేచి సారీ నాన్న అన్నాడ‌ని, నాకెందుకు సారీ చెప్తున్నావు అన‌డిగితే నా వ‌ల్ల మీ అంద‌రికీ నిద్ర ఉండ‌ట్లేదు క‌దా అన్నాడ‌ని, చిన్న పిల్లాడు అంత పెద్ద మాట అనేస‌రికి ఒళ్లు ఝ‌ళ్లుమంద‌ని నాని ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇక కెరీర్ విష‌యానికొస్తే నాని ప్ర‌స్తుతం ద‌స‌రా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ది ప్యార‌డైజ్ సినిమా చేస్తున్న విష‌యంతెలిసిందే