నాని నిజం చెప్పాడా? కవర్ చేశాడా?
తమిళ్‌లో కచ్చితంగా నానికి ఇదో పెద్ద విజయాన్ని సొంతం చేస్తుందని అక్కడి మీడియా సైతం కవర్ చేసింది. తమిళ్ లో ది ప్యారడైజ్ ప్రమోషన్‌లో కయాదు కనిపించక పోవడం చర్చనీయాంశం అయింది.
By: Ramesh Palla | 18 Sept 2026 12:02 PM ISTనాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన 'ది ప్యారడైజ్' మూవీ విడుదలకు సిద్ధం అయింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్‌లోనూ ఈ సినిమాను పెద్ద ఎత్తున చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోట్ చేస్తున్న విషయం తెల్సిందే. హీరో నాని ఇటీవల చెన్నై వెళ్లి మరీ సినిమాను ప్రమోట్ చేయడం జరిగింది. చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంతో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. అక్కడ ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ది ప్యారడైజ్ సినిమాపై ఆసక్తి కనబర్చుతున్నట్లుగా సమాచారం అందుతోంది. తమిళ్‌లో కచ్చితంగా నానికి ఇదో పెద్ద విజయాన్ని సొంతం చేస్తుందని అక్కడి మీడియా సైతం కవర్ చేసింది. తమిళ్ లో ది ప్యారడైజ్ ప్రమోషన్‌లో కయాదు కనిపించక పోవడం చర్చనీయాంశం అయింది.
నాని ది ప్యారడైజ్ మూవీ షూటింగ్....
ది ప్యారడైజ్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం అయినప్పటి నుంచి కూడా హీరోయిన్ కయాదు లోహర్ ఎక్కువగా కనిపించడం లేదు. దాంతో సోషల్ మీడియాలో ఆమె ప్రజెన్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆమె షూటింగ్స్‌తో బిజీగా ఉన్న కారణంగా ప్రమోషన్స్ కు హాజరు కాకపోవచ్చు అని ఇన్ని రోజులు అనుకున్నారు. అయితే తమిళ్ వర్షన్ ప్రమోషన్‌లో అయినా కొంత సమయం కయాదు సమయం కేటాయించి ప్రెస్ మీట్‌లో పాల్గొంటే బాగుండేది కదా అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ మీట్‌లో నానిని తమిళ జర్నలిస్ట్ ఇదే విషయాన్ని గురించి ప్రశ్నించిన సమయంలో ఆసక్తికర సమాధానం వచ్చింది. నాని సున్నితంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడంతో తమిళ మీడియా వర్గాల వారు, ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారు నాని సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు.
హీరోయిన్ కయాదు లోహర్....
కయాదు ఎందుకు ప్రెస్ మీట్‌లో, సినిమా ప్రమోషన్‌లో కనిపించడం లేదు అంటూ ప్రశ్నించిన సమయంలో నాని స్పందిస్తూ... మీరు అడిగిన ఈ ప్రశ్నకు నా వద్ద అద్భుతమైన సమాధానం ఉంది. ప్రస్తుతం కయాదు ఒక గొప్ప తమిళ సినిమాను చేస్తుంది. ఆ సినిమాకు మారి సెల్వరాజ్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన కయాదును ప్రెస్ మీట్‌కు రానివ్వలేదని చెప్పుకొచ్చాడు. తమిళ ప్రేక్షకులకు గొప్ప సినిమాను అందించడం కోసం కయాదు, మారి సెల్వరాజ్ కష్టపడుతున్నారని, తప్పకుండా వారు మీకోసం ఒక మంచి సినిమాను ఇవ్వబోతున్నారు అన్నాడు. మారి సెల్వరాజ్ మూవీ కారణంగానే కయాదు ప్రెస్ మీట్ కి హాజరు కాలేదని నాని క్లారిటీగా చెప్పాడు. అయితే నాని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు.
ది ప్యారడైజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్...
నిజంగానే కయాదు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న కారణంగా హాజరు కాలేక పోయిందా, లేదంటే షూటింగ్ సమయంలో ఏమైనా తేడాలు వచ్చాయా అంటూ కొందరు ఈ సమయంలో ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో నాని వ్యాఖ్యలు నిజమే అని కొందరు వాదిస్తూ ఉంటే, కొందరు మాత్రం నాని భలే కవర్ చేశాడు అంటున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వీడియోల్లోనూ కయాదును ఎక్కువగా చూపించక పోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కయాదు లోహర్ ఎందుకు ప్రమోషన్‌కి హాజరు కావడం లేదు అనేది ఆమె చెబితే కానీ క్లారిటీ వచ్చే పరిస్థితి లేదని కొందరు అంటున్నారు. ది ప్యారడైజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అయినా కయాదు వచ్చే అవకాశాలు ఉన్నాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ కార్యక్రమానికి సైతం కయాదు హాజరు కాకుంటే కచ్చితంగా సమ్ థింగ్ సమ్ థింగ్ అనే వారు మరింత ఎక్కువ మంది అవుతారు.
