Begin typing your search above and press return to search.

నాని ప్యారడైజ్ లో మెగా సర్ ప్రైజ్..?

ఇదిలా ఉంటే తెలుగులో కూడా అలాంటి ఒక స్పెషల్ కాంబో సెట్ చేస్తున్నారని తెలుస్తుంది.

By:  Ramesh Boddu   |   4 Sept 2025 12:00 PM IST
నాని ప్యారడైజ్ లో మెగా సర్ ప్రైజ్..?
X

తెర మీద వెరైటీ కాంబినేషన్స్ సెట్ చేస్తే ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఏ కాంబినేషన్ ని ఎలా కుదిరిస్తే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈమధ్య కాలంలో క్రేజీ మల్టీస్టారర్స్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేస్తున్నాయి. అసలు ఆ హీరోలిద్దరు కలిసి నటించడం ఒక కల అనుకుంటుంటే ఆ కాంబో సెట్ చేసి అదరగొట్టేస్తున్నారు. ఐతే అలా మల్టీస్టారర్ లా కాకపోయినా సినిమాలో ఒక క్యామియో రోల్ గా కూడా చేస్తూ మెప్పిస్తున్నారు. ఈ క్యామియో రోల్స్ ని తమిళ మేకర్స్ ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఐతే అందులో కొన్ని సక్సెస్ అవుతున్నాయి కొన్ని ఆశించిన ఫలితాన్ని ఇవ్వట్లేదు.

నాని మాస్ స్టామినా..

ఇదిలా ఉంటే తెలుగులో కూడా అలాంటి ఒక స్పెషల్ కాంబో సెట్ చేస్తున్నారని తెలుస్తుంది. న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో నాని మరోసారి తన మాస్ స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. ది ప్యారడైజ్ సినిమాలో నాని డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారట. నాని తో పాటు ఈ సినిమాలో మరో మెగా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట.

నాని సినిమాలో మెగా సర్ ప్రైజ్ అదేంటి అంటే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి క్యామియో ఒకటి ఉంటే ఎలా ఉంటుందా అన్న కోణంలో ఆలోచిస్తున్నారట. నాని సినిమాలో చిరంజీవి అదెలా సాధ్యం అంటే నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లోనే చిరంజీవి నెక్స్ట్ సినిమా చేస్తున్నారు. సో ఈ కాంబో ఆల్రెడీ కుదిరింది కాబట్టి ఈ ఇద్దరు చేస్తున్న ప్యారడైజ్ లో ఒక క్యామియో కావాలంటే చేయనని చెప్పడం కుదరదు.

మెగాస్టార్ తో సినిమా సెట్స్ మీదకు..

అందులోనూ నానికి ఎవరిని ఎలా ఎప్పుడు వాడుకోవాలో బాగా తెలుసు. మెగాస్టార్ తో సినిమా సెట్స్ మీదకు వెళడానికి ముందే ఆ మెగా మేనియా ది ప్యారడైజ్ కి ఉపయోగపడేలా చిరంజీవి క్యామియో ఒకటి అనుకుంటున్నారట. ది ప్యారడైజ్ లో నిజంగానే చిరంజీవి క్యామియో రోల్ ఉంటే మాత్రం కచ్చితంగా సినిమా సంథింగ్ స్పెషల్ అనిపిస్తుందని చెప్పొచ్చు. నాని ది ప్యారడైజ్ సినిమా కథే వేరే లెవెల్ అంటే ఈ అదనపు మెరుగులు సినిమాకు మరింత రేంజ్ తెచ్చేలా చేస్తున్నాయి.

చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర, మన శంకర వరప్రసాద్ రెండు సినిమాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేయగా విశ్వంభర 2026 సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. నాని శ్రీకాంత్ ఓదెల సినిమా ఈ రెండు రిలీజ్ తర్వాతే జరుగుతుంది. ఇదే కాదు కె.ఎస్ బాబీతో కూడా చిరంజీవి ఒక సినిమా ప్లాన్ చేశారు. అది కూడా నెక్స్ట్ ఇయరే సెట్స్ మీదకు వెళ్తుంది.