నాని ర్యాంప్ వాక్ డ్రెస్.. అసలు సెట్ అయినట్లు లేదే!
టాలీవుడ్ హీరో నానికి నేచురల్ స్టార్ ట్యాగ్ ఎందుకు వచ్చిందో తెలిసిందే. ఎప్పుడు సహజంగా అనిపించే ఆకర్షణతో ఉంటారు.
By: M Prashanth | 11 Aug 2025 12:59 PM ISTటాలీవుడ్ హీరో నానికి నేచురల్ స్టార్ ట్యాగ్ ఎందుకు వచ్చిందో తెలిసిందే. ఎప్పుడు సహజంగా అనిపించే ఆకర్షణతో ఉంటారు. అంతే సహజంగా సినిమాల్లో నటిస్తారు. వినయంతో కూడా ఉంటారు. అలా ఆయన మాటలు, డ్రెస్సింగ్ సహా ఆఫ్ స్క్రీన్ శైలి అంతా నేచురల్ గా ఉంటుంది. అదే నాని పర్సనల్ బ్రాండ్ గా కూడా మారింది.
కానీ రీసెంట్ గా నాని వేసుకున్న ఓ ఔట్ ఫిట్ మాత్రం ట్రోల్స్ ఎదుర్కొంటోంది. అందుకు సంబంధించిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇటీవల 2025 ఫిల్మ్ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమానికి నాని అటెండ్ అయ్యారు.
మ్యాన్ ఆఫ్ స్టైల్ అండ్ సబ్ స్టాన్స్ అవార్డును కూడా అందుకున్నారు. ఆ సమయంలో ఈవెంట్ ఫోటో స్టాప్ లో కెమెరాలకు పోజులిచ్చారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈవెంట్ కోసం ఆయన వేసుకున్న బ్లాక్ డ్రెస్ అస్సలు బాగోలేదని నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ర్యాంప్ వాక్ స్టైల్ లో ఉన్న డ్రెస్.. నానికి పూర్తిగా సెట్ కాలేదని అభిమానులు చెబుతున్నారు. ఆయన వ్యక్తిత్వానికి సరిపోలేదని, సౌకర్యవంతంగా కనిపించలేదని అంటున్నారు. పక్కింటి అబ్బాయి ఇమేజ్ లా కాకుండా ఆ శైలి ఆర్టిఫీషియల్ గా అనిపించిందని చెబుతున్నారు. అదే సమయంలో కొందరు నాని ఔట్ ఫిట్ ను ట్రోల్ చేస్తున్నారు.
నాని ఔట్ ఫిట్ వీడియోను షేర్ చేస్తున్నారు. అయితే ఆయన డ్రెస్ సెట్ కాకపోవడం నిజమైనప్పటికీ.. ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. మరోవైపు.. కొందరు సినీ ప్రియులు.. డ్రెస్సింగ్ స్టైల్ పై తప్పకుండా ఫోకస్ చేయాలి చెబుతున్నారు. భవిష్యత్తులో అనవసరమైన విమర్శలను నివారించుకోమని సూచిస్తున్నారు.
ఇక నాని కెరీర్ విషయానికొస్తే.. ఇప్పుడు ఆయన ప్యారడైజ్ మూవీతో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఆ సినిమా.. విభిన్నమైన కథతో రూపొందుతోంది. నాని డిఫరెంట్ లుక్ లో జడల్ రోల్ లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ తో పాటు మొత్తం 8 భాషల్లో వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
