Begin typing your search above and press return to search.

'రూల్స్ అన్నీ బ్రేక్ చేశా'.. నాని బర్త్ డే వేళ ఓదెల

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని బర్త్ డే సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

By:  M Prashanth   |   24 Feb 2026 10:52 AM IST
రూల్స్ అన్నీ బ్రేక్ చేశా.. నాని బర్త్ డే వేళ ఓదెల
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని బర్త్ డే సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కెరీర్‌ లో స్పెషల్ పర్సన్ గా నిలిచిన నానిపై ఉన్న ప్రేమ, గౌరవం, నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఆయన రాసిన నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి ది ప్యారడైజ్ మూవీ చేస్తున్న వేళ.. ఆయన నోట్ చక్కర్లు కొడుతోంది.

శ్రీకాంత్ ఓదెల తన నోట్‌ లో ''నాని అన్నా… నువ్వు ప్రతిసారి 'నీ ఇష్టం శ్రీకాంత్' అని చెప్పినప్పుడల్లా నాకు అది 'ఐ ట్రస్ట్ యూ'లా వినిపిస్తుంది. ఆ నమ్మకమే నన్ను ప్రతి క్షణం భయపెడుతుంది. ఆ విశ్వాసానికి తగినట్టుగా నా రక్తం, ఆత్మ మొత్తం ది ప్యారడైజ్ కోసం పెట్టాలని అనిపిస్తుంది'' అంటూ ప్రారంభించారు. ఒక దర్శకుడిగా తన జర్నీలో నాని ఇచ్చిన ఫ్రీడమ్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్ గురించి ఆయన ఎంతో భావోద్వేగంగా గుర్తుచేశారు.

సినిమా నిర్మాణంలో తాను నాని విధానాలు ఎన్నోసార్లు మార్చేశానని శ్రీకాంత్ ఓదెల తెలిపారు. పని రోజుల షెడ్యూల్ నుంచి రిలీజ్ డేట్ వరకు కూడా వర్కింగ్ స్టైల్ నుంచి మేకింగ్ ప్యాటర్న్ వరకూ అనేక రూల్స్ బ్రేక్ చేశానని ఒప్పుకున్నారు. 'ప్రతి సారి నేను నిన్ను బ్రేక్ చేసినా.. నువ్వు నన్నే బిల్డ్ చేశావు అన్నా. నేను ఈరోజు ఉన్న స్థాయికి రావడానికి కారణం నువ్వే' అంటూ కృతజ్ఞత వ్యక్తం చేశారు.

సినిమా కోసం నానికి బ్రెయిడ్స్ వేయమన్నా, చేతిపై టాటూ వేయమన్నా, ఎన్ని రీటేక్స్ తీసినా ఆయన ఎప్పుడూ ఒకే మాట చెప్పేవారని.. 'ఓకే రా… నీ ఇష్టం'.. ఆ మాటే తనకు ధైర్యమిచ్చిందని చెప్పారు. ఆ విశ్వాసం వల్లే తాను మరింత బాధ్యతగా పనిచేస్తున్నానని తెలిపారు. ఆ నమ్మకానికి తగిన ఫలితం ఇవ్వాలనే తపనతో 'ది ప్యారడైజ్'ను తీర్చిదిద్దుతున్నానని పేర్కొన్నారు.

'నన్ను నమ్మిన నా ధరణి… మళ్లీ నన్ను నమ్ముతున్న నా జడల్' అంటూ సినిమా పాత్రల పేర్లు ప్రస్తావించారు శ్రీకాంత్. నాని తనకు కేవలం హీరో మాత్రమే కాదని, జీవితాంతం రుణపడి ఉండే అన్నయ్య లాంటివాడని ఎమోషనల్ గా తెలిపారు. చివరగా 'హ్యాపీ బర్త్‌ డే నాని అన్నా… జీవితాంతం నీకు రుణపడి ఉంటాను' అంటూ తన ప్రేమను వ్యక్త పరిచారు. అదే సమయంలో శ్రీకాంత్ షేర్ చేసిన పిక్ కూడా వైరల్ గా మారింది. సెట్స్ లో విజువల్స్ చూస్తున్న ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక ఫ్యాన్స్ కూడా ఆ సందేశాన్ని షేర్ చేస్తూ, నాని– శ్రీకాంత్ ఓదెల బంధాన్ని అభినందిస్తున్నారు. డైరెక్టర్– యాక్టర్ మధ్య ఉన్న ఆ నమ్మకం, అనుబంధం 'ది ప్యారడైజ్' సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఎమోషనల్ జర్నీ సిల్వర్ స్క్రీన్ పై ఎలా కనిపిస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ప్యారడైజ్ మూవీ ఎలా ఉంటుందో.. నానికి శ్రీకాంత్ ఎలాంటి హిట్ ఇస్తారో వేచి చూడాలి.