మిగతా హీరోలకు నానికి ఉన్న తేడా ఇదే..
ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది హీరోలు తమ సినిమాల మధ్య ఏళ్ల తరబడి గ్యాప్ తీసుకుంటుంటే, నాని మాత్రం పక్కా ప్లానింగ్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్నారు
By: M Prashanth | 18 Jan 2026 5:00 PM ISTన్యాచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది హీరోలు తమ సినిమాల మధ్య ఏళ్ల తరబడి గ్యాప్ తీసుకుంటుంటే, నాని మాత్రం పక్కా ప్లానింగ్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ప్రతి సినిమాకు కనీసం 7 నుండి 10 నెలల గ్యాప్ ఉండేలా చూసుకుంటూ, ఆడియన్స్‌కు బోర్ కొట్టకుండా వెరైటీ సబ్జెక్టులతో పలకరిస్తున్నారు.
కోవిడ్ తర్వాత 2021 డిసెంబర్ 24న శ్యామ్ సింగరాయ్ తో మొదలైన ఈ జర్నీ, వరుస హిట్లతో కొనసాగుతోంది. ఆ తర్వాత కేవలం 168 రోజుల గ్యాప్‌తోనే 2022 జూన్ 10న 'అంటే సుందరానికీ..' తో వచ్చారు. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా, ఒక సినిమా నుండి మరో సినిమాకు ఆయన చూపిస్తున్న వేరియేషన్ నేటి తరం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన దసరా 2023 మార్చి 30న విడుదలైంది. ఈ మాస్ అవతారం తర్వాత మళ్ళీ 252 రోజుల గ్యాప్‌తో 2023 డిసెంబర్ 7న హాయ్ నాన్న అనే క్యూట్ ఫ్యామిలీ డ్రామాతో వచ్చి క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించారు. ప్రతి సినిమాకు ఒక డిఫరెంట్ లుక్, సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో నాని తన న్యాచురల్ యాక్టింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక 2024 ఆగస్టు 29న సరిపోదా శనివారం తో యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిన నాని, ఆ తర్వాత కేవలం 245 రోజుల గ్యాప్‌తో గతేడాది అంటే 2025 మే 1న HIT 3 తో అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా థియేటర్లలోకి వచ్చారు. ఈ చిత్రం నాని కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్స్ గా నిలవడం విశేషం. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా HIT 2, కోర్టు వంటి సినిమాలతో నాని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.
ఇప్పుడు అందరి ఫోకస్ ది ప్యారడైజ్ సినిమాపైనే ఉంది. తన ఫేవరెట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చి 26, విడుదల కావాలి. అయితే షూటింగ్ ఆలస్యం వల్ల డేట్ మరే అవకాశం ఉంది. కానీ మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే సమ్మర్ లో వచ్చే అవకాశం ఉంది. HIT 3 రిలీజ్ తర్వాత దాదాపు ఏడాది తర్వాత వస్తున్న ఈ సినిమా నాని కెరీర్ లోనే కాస్ట్లీయెస్ట్ మూవీగా నిలవనుంది. ఈ సినిమా కోసం నాని తన లుక్ ను కంప్లీట్ గా మార్చేశాడు.
పక్కా ప్రణాళికతో, గ్యాప్ లేకుండా కష్టపడుతూ నాని టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా, నిర్మాతగా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఉండటం ఆయన గొప్పతనం. మరి నెక్స్ట్ రాబోయే ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
