Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ స్టార్ కావాల‌నే వారికి దూర‌మౌతున్నాడా?

నేచుర‌ల్ స్టార్ నాని. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు, మ‌రీ ముఖ్యంగా పిల్ల‌ల‌కు బాగా ద‌గ్గ‌రైన హీరో. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియ‌న్స్ నానిని త‌మ ఇంటి కుర్రాడిలా ఓన్ చేసుకున్నారు.

By:  Ravindar Gorantla   |   3 March 2026 1:00 PM IST
నేచుర‌ల్ స్టార్ కావాల‌నే వారికి దూర‌మౌతున్నాడా?
X

నేచుర‌ల్ స్టార్ నాని. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు, మ‌రీ ముఖ్యంగా పిల్ల‌ల‌కు బాగా ద‌గ్గ‌రైన హీరో. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియ‌న్స్ నానిని త‌మ ఇంటి కుర్రాడిలా ఓన్ చేసుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌ని ఎంట్‌టైన్ చేస్తూ వ‌స్తున్నాడు. ఒక ద‌శ‌లో పైసా, జెండాపై క‌పిరాజు వంటి సినిమాల‌తో యాక్ష‌న్ బాట ప‌ట్టి కెరీర్ ఆల్ మోస్ట్ ఎండ్ అనే స్టేజ్‌కి చేరిన నానికి రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించ‌డ‌మే కాకుండా నాని కెరీర్‌లో ఫ‌స్ట్ రూ.50 కోట్ల వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన మూవీని అందించి నిల‌బెట్టారు.

అక్క‌డి నుంచి నా జ‌ర్నీ కొత్త పంథాలో సాగుతూ వ‌చ్చింది. ఆ త‌రువాత చేసిన `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌`. మ‌జ్ను, నేను లోక‌ల్‌, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి, జెర్సీ, హాయ్ నాన్న‌ వంటి సినిమాల‌తో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి మ‌రింత చేరువైన నాని త‌న కంటూ భారీ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే గ‌త కొన్నేళ్లుగా కుటుంబ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తూ త‌న‌దైన మార్కు హిట్‌ల‌ని సొంతం చేసుకుంటూ వ‌స్తున్న నేచుర‌ల్ స్టార్ తాజాగా త‌న స్ట్రాట‌జీని మార్చుకున్న‌ట్టుగా తెలుస్తోంది.

శ్రీ‌కాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన మాసీవ్ యాక్ష‌న్ డ్రామా `ద‌స‌రా` సినిమా నాని సినిమాల్లో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుని వంద కోట్ల క్ల‌బ్‌లో చేర్చింది. ఈ సినిమా అందించిన జోష్‌తో త‌న‌లో భారీ మార్పులు మొద‌ల‌య్యాయి. క్లాస్ హీరోగా కంటే మాస్ హీరో అనిపించుకోవాల‌న్న ప‌ట్టుద‌ల స్టార్ట్ అయింది. అందులో భాగంగానే ఫ్యామిలీ, చిల్డ్ర‌న్‌ ఆడియ‌న్స్‌కు నాని కావాల‌నే దూరమ‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది. బ్యాక్‌టు బ్యాక్ హార్ట్ కోర్ యాక్ష‌న్ సినిమాల‌ని ఎంచుకుంటూ మాస్ ఇమేజ్ వైపు నాని ప‌రుగులు తీస్తున్నాడు.

ప్ర‌స్తుతం యంగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న `ది ప్యార‌డైజ్‌` మూవీలో నాని మాసీవ్ అవ‌తార్‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. పూర్తి స్థాయి హింసాత్మ‌క సన్నివేశాల‌తో, ర‌క్త‌పాతం నేప‌థ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ ఇంపాక్ట్ వీడియో, అందులోని డైలాగ్‌లు నెట్టింట వైర‌ల్‌గా మారి పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపింది. కంటెంట్ మాసీవ్‌గా, హార్ట్ కోర్ యాక్ష‌న్‌తో పాటు బ్ల‌డ్ షేడ్ అధికంగా ఉండ‌టంతో ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియ‌న్స్, పిల్ల‌లు దూర‌మ‌వుతున్న‌ట్టుగా కామెంట్‌లు వినిపిస్తున్నాయి.

దీని తరువాత కూడా నాని `బ్ల‌డీ రోమియో` పేరుతో చేస్తున్న సినిమా కూడా పూర్తి స్థాయిలో సాగే హింసాత్మ‌క క‌థాంశంతో రూపుదిద్దుకోనుంద‌ని స్ప‌ష్టం కావ‌డంతో నాని సినిమాల‌కు ఫ్యామిలీ ఆడియ‌న్స్ దూరమ‌వుతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఉన్న‌ట్టుండీ నాని బ్యాక్ టు బ్యాక్ మాసీవ్ యాక్ష‌న్ డ్రామాల‌ని ఎంచుకోవ‌డంతో త‌న‌కు మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాల‌ని ఉంద‌ని, అందులో భాగంగానే ర‌క్త‌పాతం నేప‌థ్యంలో రూపొందే క‌థ‌ల‌ని ఎంచుకుంటున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. నాని ఇదే పంథాని కొన‌సాగిస్తే ఇంత కాలం త‌న‌కు బ్యాక్ బోన్‌గా నిలిచిన ఫ్యామిలీ ఆడియ‌న్స్ దూర‌మ్యే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి.