Begin typing your search above and press return to search.

నాని 'ప్యారడైజ్'.. ఇండస్ట్రీ షాక్ అయినట్లు ఉందే?

నేచురల్ స్టార్ నాని తన గెటప్, డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ తో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

By:  M Prashanth   |   25 Feb 2026 1:02 PM IST
నాని ప్యారడైజ్.. ఇండస్ట్రీ షాక్ అయినట్లు ఉందే?
X

నేచురల్ స్టార్ నాని తన గెటప్, డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ తో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఏకంగా ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు! దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి ఆయన చేస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ నుంచి విడుదలైన మొదటి పాట ఆయా షేర్.. సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

గతంలో ఇదే కాంబినేషన్‌ లో వచ్చిన దసరా బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో నానిని మాస్ రోల్ లో చూపించి దర్శకుడు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ది ప్యారడైజ్ మూవీలోనూ నానిని పూర్తిగా భిన్నమైన లుక్‌ లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సాంగ్ తో క్లారిటీ వచ్చేసింది. ఆయా షేర్ పాటలో నాని రగ్డ్ స్టైల్, ఎనర్జిటిక్ డాన్స్, మాస్ బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా హార్డ్ ఫ్లోర్ స్టెప్స్ వేస్తూ ఆయన చూపించిన జోష్.. అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌ లో నాని కనిపించడం.. ఆ పాటకు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్‌ లో గ్రాండ్ విజువల్స్, భారీ సెట్స్, నేచురల్ టోన్ కనిపిస్తున్నాయి.

మాస్ లీడర్ స్టోరీని రియాలిటీగా, స్టైలిష్‌ గా చూపించాలన్న ప్రయత్నం స్పష్టంగా తెలుస్తోంది. ఆయా షేర్ పాటకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ మరోసారి తన మాస్ బీట్‌ తో ఆకట్టుకున్నారు. ఫోక్ టచ్‌ తో కంపోజ్ చేసిన ఆ ట్యూన్‌ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోల రూపంలో పాట ఫుల్ వైరల్ అవుతోంది.

ఇక సినిమాను నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల్లో ఎలాంటి రాజీ లేకుండా ఇంటర్నేషనల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం. మొదటి పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఏదేమైనా ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల అవుతుంది.

అయితే ఒక్క పాటతోనే ఇంతటి హైప్ తెచ్చుకున్న ఆ సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మొత్తానికి.. నాని మరోసారి తన కెరీర్ లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతూ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నారు. ది ప్యారడైజ్ ఆయన కెరీర్‌ లో మరో మైల్ స్టోన్ గా నిలిచేలా కనిపిస్తోంది. మరి మూవీ ఎలా ఉంటుందో, ఎంతటి హిట్ అవుతుందో వేచి చూడాలి.