Begin typing your search above and press return to search.

ఆయా షేర్ హుక్ స్టెప్ వెనుక నాని కష్టం!

కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ రీసెంట్‌గా ఈ పాట గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

By:  Madhu Reddy   |   2 March 2026 3:54 PM IST
ఆయా షేర్ హుక్ స్టెప్ వెనుక నాని కష్టం!
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ నుండి విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఆ పాటలోని హుక్ స్టెప్ ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ అదిరిపోయే స్టెప్ వెనుక నాని పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. భుజం గాయంతో బాధపడుతున్నా సరే, ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఆ సాంగ్ పూర్తి చేసాడని, ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వివరాలు చూద్దాం..

గాయాన్ని సైతం లెక్కచేయకుండా.. సింగిల్ టేక్‌లో ఫినిష్:

కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ రీసెంట్‌గా ఈ పాట గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సాంగ్ షూటింగ్‌కు ముందే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా నాని భుజానికి తీవ్రమైన గాయమైందట.ఇక నొప్పితో ఇబ్బంది పడుతున్నా సరే, సాంగ్ ఎనర్జీ తగ్గకూడదని నాని పట్టుబట్టి ఆ హుక్ స్టెప్‌ను ప్రాక్టీస్ చేశారు. అందరూ ఆశ్చర్యపోయేలా ఆ వైరల్ హుక్ స్టెప్‌ను ఎలాంటి బ్రేక్ లేకుండా ఒకే షాట్‌లో, ఒకే టేక్‌లో ఓకే చేసేశారట. నాని అంకితభావం చూసి యూనిట్ మొత్తం ఫిదా అయిపోయింది అని ఆయన తెలిపారు.

శ్రీకాంత్ ఓదెల మార్క్ మాస్.. విలన్‌గా మోహన్ బాబు:

శ్రీకాంత్ ఓదెల-నాని కాంబినేషన్‌లో 'దసరా' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో నానిని ఇదివరకు ఎన్నడూ చూడని ఊర మాస్ లుక్‌లో చూపించబోతున్నారు శ్రీకాంత్. దీనికి తోడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. నాని, మోహన్ బాబు మధ్య వచ్చే సీన్లు వెండితెరపై నిప్పులు చెరుగుతాయని టాక్. ఇక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాని తన మేకోవర్‌ను కూడా పూర్తిగా మార్చేశారు. ఈ పాటలో జడలు వేసి మరీ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచాడు .

ఆగస్టు 21న బాక్సాఫీస్ వద్ద ‘ప్యారడైజ్’ గర్జన:

మేకర్స్ మొదట ఈ సినిమాను మార్చి నెలలోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకూడదని, షూటింగ్ పనులు పెండింగ్‌లో ఉండటంతో సినిమాను ఆగస్టు 21కి వాయిదా వేశారు. ఇక 'దసరా' సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే, ఇప్పుడు అదే కాంబో రిపీట్ అవుతుండటంతో 'ది ప్యారడైజ్' పై ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ ఉంది. ఇక నాని బర్త్‌డే గిఫ్ట్‌గా వచ్చిన ‘ఆయా షేర్’ సాంగ్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, సినిమా రిజల్ట్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.