Begin typing your search above and press return to search.

స్లిమ్ గా కనిపించే నాని బరువు ఎంతో తెలుసా?

దీంతో చిత్ర యూనిట్ ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటోంది. అక్కడ ఆయన బరువుకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటపడింది...

By:  Madhu Reddy   |   29 Sept 2026 5:39 PM IST
స్లిమ్ గా కనిపించే నాని బరువు ఎంతో తెలుసా?
X

టాలీవుడ్ లో 'అష్ట చమ్మా' చిత్రంతో పక్కింటి కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చి, లవర్ బాయ్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసిన నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు తన రూట్‌ను పూర్తిగా మార్చేశారు. 'జెర్సీ', 'హాయ్ నాన్న' వంటి ఎమోషనల్ చిత్రాలతో అలరించిన ఆయన, 'సరిపోదా శనివారం' నుంచి కంప్లీట్ మాస్ యాక్షన్ జోనర్‌లోకి అడుగుపెట్టారు. తాజాగా ఎన్నో అంచనాలతో వచ్చిన ‘పారడైస్’ సినిమా ఘన విజయాన్ని సాధించింది. దీంతో చిత్ర యూనిట్ ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటోంది. అక్కడ ఆయన బరువుకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటపడింది...

మేడారంలో సమ్మక్క-సారలమ్మ దర్శనం:

తాజాగా నాని తన నూతన చిత్రం 'ది ప్యారడైజ్' చిత్ర బృందంతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారం వెళ్లారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ చిత్రంలో నాని తల్లి పాత్రకు 'సమ్మక్క' అనే పేరు ఉండటం, ఆ సెంటిమెంట్‌తోనే ఆయన దర్శనానికి వెళ్లడం విశేషం. నానితో పాటు నటుడు సంపూర్ణేశ్ బాబు, చిత్ర యూనిట్ సభ్యులు ఈ పూజల్లో పాల్గొన్నారు.

తులాభారంలో సరిగ్గా 74 కిలోలు!:

అమ్మవారి మొక్కులో భాగంగా నాని తన బరువుకు సమానంగా బెల్లం (బంగారం) తులాభారంలో సమర్పించారు. ఈ తూనికలో నాని బరువు సరిగ్గా 74 కిలోలు ఉన్నట్లు తేలింది. అప్పట్లో చాలా సన్నగా, సాధారణంగా కనిపించే మన నేచురల్ స్టార్.. ఇప్పుడు వరుస మాస్ సినిమాల కోసం ఫిజిక్ పెంచి పర్ఫెక్ట్ మాస్ లుక్‌లోకి మారారు. అయినా సరే 74 కిలోల పర్ఫెక్ట్ వెయిట్‌తో ఆయన చాలా ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుండటం విశేషం.

భారీగా తరలివచ్చిన అభిమానులు :

తన అభిమాన హీరో మేడారానికి వస్తున్నాడని తెలుసుకున్న స్థానికులు, ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలో పూజల అనంతరం పూజారులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఇక నానిని చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతం మొత్తం పండగ వాతావరణాన్ని తలపించింది. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర ఖాయం:

లవర్ బాయ్ ఇమేజ్ నుంచి కంప్లీట్ మాస్ హీరోగా మారిన నాని, ఇప్పుడు 'ది ప్యారడైజ్' సినిమాతో మరో పవర్‌ఫ్యాక్ట్ హిట్ అందించారు. ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో వేచి చూడాలి. నాని లేటెస్ట్ మేకోవర్ అండ్ మేడారం ట్రిప్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ నిలవాలని,మరిన్ని రికార్డ్స్ తిరగరాయాలని అభిమానులు కోరుకుంటున్నారు..