17 ఏళ్ల ప్రయాణం ముంగిట ఓ చరిత్రలా!
నేచురల్ స్టార్ నాని చిత్ర పరిశ్రమకొచ్చి 17 ఏళ్లు పూర్తయింది. ఇంతింతై వటుడింతైన చందంగా నాని పరిశ్రమలో ఎదిగాడు.
By: Srikanth Kontham | 8 Sept 2025 11:38 AM ISTనేచురల్ స్టార్ నాని చిత్ర పరిశ్రమకొచ్చి 17 ఏళ్లు పూర్తయింది. ఇంతింతై వటుడింతైన చందంగా నాని పరిశ్రమలో ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోగా నీరాజనాలు అందుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ తర్వాత ఇండస్ట్రీలో అంతటి మహావృక్షంలా తనని తాను నిర్మించుకున్నాడు. 17 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు అందుకున్నాడు. 'అష్టాచెమ్మా' నుంచి 'హిట్ ది థర్డ్ కేస్' వరకూ నేచురల్ స్టార్ పోషించిన పాత్ర లేదు. తనలో ఆ సహజ నటనే అంత గొప్ప స్టార్ గా తీర్చిదిద్దింది.
'దసరా' తర్వాత మరోసారి:
ఈ మొత్తం ప్రయాణం ఒక ఎత్తైతే? అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటూ నాని కూడా ప్రక టించాడు. ఇకపై తనని తాను పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే మిగిలింది. `దసరా`తో పాన్ ఇండియా ప్రయత్నం చేసినా అది పెద్దగా కలిసి రాలేదు. రీజనల్ మార్కెట్ కే ఆ సినిమా పరిమితమైంది. అటుపై రిలీజ్ అయిన `హిట్ ది థర్డ్ కేస్` పాన్ ఇండియాలో రిలీజ్ అయినా ఆశీంచిన ఫలితం రాలేదు. దీంతో మరోసారి 'దసరా' దర్శకుడిపైనే నాని ఆశలన్నీ కనిపిస్తున్నాయి.
యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్:
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలతో 'ది ప్యారడైజ్' చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. నాని కెరీర్ లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మాణమవుతుంది. పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న చిత్రం కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకోవాలని శ్రీకాంత్-నాని ద్వయం పని చేస్తోంది. 'ది ప్యారడైజ్' కంటెంట్ కూడా భారీ మాస్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా ప్రచారం జరుగుతోంది. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా నెట్టింట వైరల్ అవుతుంది. అందులో నిజమెంతో తెలియాలి.
ఓ చరిత్రలా నిలిచే ప్రయత్నం:
'దసరా' ని 70-80 కాలం నాటి పీరియాడిక్ కథాంశంగా చూపించి రీజనల్ మార్కెట్ లో సక్సెస్ అయ్యారు. కానీ ఆ స్ట్రాటజీ పాన్ ఇండి యాలో వర్కౌట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో 'ది ప్యారడైజ్' అందుకు భిన్న మైన కంటెంట్ అవుతుందని అభిమానులు ఆశీస్తున్నారు. ఈ సినిమా కోసం నాని కూడా లుక్ లో చాలా మార్పులు చేసాడు. బాడీ షేప్ పూర్తిగా మారింది. శరీరాకృతిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇలాంటి మార్పులన్నీ ది ప్యారడైజ్ పై అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి. తన 17 ఏళ్ల సినీ ప్రయాణం ముంగిట `ది ప్యారడైజ్` రూపంలో ప్రేక్షకాభిమానులకు భారీ హిట్ ఇచ్చి ఓ చరిత్రలా ముందుకు సాగాలని ఆశీస్తున్నాడు. మరేం జరుగుతుందన్నది చూడాలి.
