Begin typing your search above and press return to search.

సైక్ సిద్ధార్థ్ స్టఫ్ ఓకే.. కానీ..?

2006 నుంచి 2025 వరకు అతని చేయని ప్రయత్నం లేదు. ఐతే ఈమధ్య స్మాల్ స్క్రీన్ హోస్ట్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్న నందు లేటెస్ట్ గా తన సొంత నిర్మాణంలో సైక్ సిద్ధార్థ్ అనే సినిమా చేశాడు.

By:  Ramesh Boddu   |   4 Dec 2025 8:00 PM IST
సైక్ సిద్ధార్థ్ స్టఫ్ ఓకే.. కానీ..?
X

దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ హీరోగా ప్రయ్హత్నించి ఫ్రెండ్ రోల్స్ చేస్తూ విలన్ గా కూడా ట్రై చేసి సిల్వర్ స్క్రీన్ కాదు స్మాల్ స్క్రీన్ బెటర్ అని అక్కడ తన టాలెంట్ చూపించి.. రియాలిటీ షో హోస్ట్ గా.. క్రికెట్ కామెంట్రీ హోస్ట్ గా ఇలా తనలో ఉన్న టాలెంట్ అంతా చూపిస్తూ వస్తున్నాడు నందు. కానీ ఎంత కష్టపడినా అతనికి రావాల్సిన గుర్తింపు మాత్రం రావట్లేదని చెప్పొచ్చు. ఎప్పుడో శివ నాగేశ్వర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఫోటో సినిమాతో పరిచయమయ్యాడు నందు .

ట్రైలర్ లో నందు యాక్టింగ్..

2006 నుంచి 2025 వరకు అతని చేయని ప్రయత్నం లేదు. ఐతే ఈమధ్య స్మాల్ స్క్రీన్ హోస్ట్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్న నందు లేటెస్ట్ గా తన సొంత నిర్మాణంలో సైక్ సిద్ధార్థ్ అనే సినిమా చేశాడు. లీడ్ యాక్టర్ గా తనే నటిస్తూ నిర్మించిన సైక్ సిద్ధార్థ్ సినిమాను వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ లాక్ చేశారు. సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

సైక్ సిద్ధార్థ్ ప్రేమతో పాటు తన జీవితంలో ఒక ఉన్నంత లక్ష్యం పెట్టుకుని కలలు కంటున్న అతని జీవితం ఎలా మారింది అన్నదే సినిమా పాయింట్. సినిమా ట్రైలర్ లో నందు యాక్టింగ్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సైక్ సిద్ధార్థ్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంది. సినిమాలో కావాల్సినంత బోల్డ్ స్టఫ్ ఉందని తెలుస్తుంది. యూత్ ఆడియన్స్ కి కావాల్సిన కంటెంట్ అంతా ఉంది కాబట్టి ఈ సైక్ సిద్ధార్థ్ ని వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని..

స్వతహాగా తన కెరీర్ తాను ప్లాన్ చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు నందు. ఇప్పటివరకు సరైన బ్రేక్ అయితే రాలేదు. సైక్ సిద్ధార్థ్ మీద అతని టైం ని మాత్రమే కాదు నిర్మాతగా తన డబ్బు కూడా పెట్టాడు. సో ఈ సినిమాతో నందు తనేంటో ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఐతే సైక్ సిద్ధార్థ్ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉన్నా కొన్ని సీన్స్ అర్జున్ రెడ్డి ఇంకా రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలను గుర్తు చేస్తున్నాయి. మరి ఈ సైక్ ఆ సినిమాల కన్నా డిఫరెంట్.. ఇది వేరే లెవెల్ అని ప్రూవ్ చేస్తే మాత్రం నందు సక్సెస్ అయినట్టే లెక్క. డిసెంబర్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై నందు మాత్రం చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

ఎలాగు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సినిమాని గట్టిగా ప్రమోట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు నందు. సో యూత్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయగలిగితే మాత్రం సైక్ సిద్ధార్థ్ గట్టేక్కే ఛాన్స్ ఉంటుంది.