బడ్జెట్ కట్స్ తో రోడ్డు మీద బట్టలు లేకుండా యువ హీరో
నటుడిగా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నందు అప్పుడప్పుడు హీరోగా కూడా ట్రై చేస్తున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 4 Nov 2025 10:11 AM ISTనటుడిగా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నందు అప్పుడప్పుడు హీరోగా కూడా ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. తనదైన యూనిక్ స్టైల్‌తో ఆడియెన్స్‌ను ఎప్పుడూ ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. ఇప్పుడు, తన కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ను కూడా అంతే వెరైటీగా, ఫన్నీగా ప్లాన్ చేశాడు. "నా జీవితంలోనే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్" అంటూ ఒక వీడియో వదిలాడు.
ఈ అనౌన్స్‌మెంట్ వీడియో ఒక సెటైరికల్ స్కిట్‌లా సాగింది. "ఒక పెద్ద సినిమాను చిన్న బడ్జెట్‌లో తీశాను" అంటూ తన చిన్న టీమ్ ను పరిచయం చేశాడు. జేమ్స్ కెమెరామెన్, స్టీఫెన్ ఐస్‌బర్గ్, వరుణ్ రెడ్డి అంటూ ఫన్నీ పేర్లు పెట్టాడు. వీడియో మొదట్లో స్టైలిష్ రెడ్ జాకెట్, బ్లూ కార్‌తో బిల్డప్ ఇచ్చినా, ఆ తర్వాత బడ్జెట్ కట్స్ మొదలవుతాయి.
బడ్జెట్ కంట్రోల్ ఎంతలా చేశాడంటే, చివరికి నందు ఒంటిమీద బట్టలు కూడా ఉండవు, కేవలం ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్‌ను అడ్డం పెట్టుకుని నిల్చుంటాడు. "కార్ ఏది?" అని అడిగితే, "అదేం లేదు, జస్ట్ క్లీనింగ్‌కు పంపించాను" అని కవర్ చేస్తాడు. కెమెరామెన్ ప్రకాష్ రెడ్డి లైట్లు అడగలేదట, క్రేన్ ఎందుకని, 6 అడుగులు ఉన్న అతన్నే లైట్ పట్టుకోమన్నారట.
ఎడిటర్ ప్రతీక్ "కట్ చేసి కట్ చేసి.. మొత్తం బడ్జెటే కట్ చేసేశాడు" అంటూ తన టెక్నీషియన్లపై ఫన్నీ సెటైర్లు వేశాడు. సౌండ్ డిజైన్ కోసం కుక్క సౌండ్ కావాలంటే, తానే "బౌ బౌ" అని అరిచినట్లు చూపించారు. ఈ ఫన్నీ స్కిట్ మొత్తానికీ హైలైట్ చివర్లో అతను చెప్పిన పంచ్ డైలాగ్. ఇప్పుడు ఇక్కడ నందు మీకు 'బాక్స్'లో కనిపించొచ్చు.. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత 'బాక్స్ ఆఫీస్'లో రికార్డులు బద్దలు కొడతాడు ఈ నందు.. అంటూ తన సినిమాపై కాన్ఫిడెన్స్ చూపించాడు.
"#EESALAHITNAMDE" అనే హ్యాష్‌ట్యాగ్‌తో వీడియోను ముగించాడు. అయితే, ఈ వీడియో మొత్తం ఒక "సైక్" (PSYCH) అని, అసలైన అనౌన్స్‌మెంట్ ఇది కాదని ట్విస్ట్ ఇచ్చాడు. అసలు సిసలైన నెక్స్ట్ అనౌన్స్‌మెంట్ నవంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఉండబోతోందని ప్రకటించాడు. సినిమా అనౌన్స్‌మెంట్‌కు ఇలాంటి క్రియేటివ్, ఫన్నీ వీడియో చేయడం అనేది చాలా కొత్తగా ఉంది, నెటిజన్లలో కావాల్సినంత క్యూరియాసిటీని పెంచింది. మరి నందు నెక్స్ట్ ప్రాజెక్టు ఏ విధంగా ఉంటుందో చూడాలి.
