Begin typing your search above and press return to search.

అంత పెద్ద హిట్ తర్వాత.. నందిని మళ్లీ వెబ్ సిరీస్‌కేనా?

‘మా ఇంటి బంగారం’తో నందిని రెడ్డికి చాలా రోజుల తర్వాత పెద్ద హిట్ దక్కింది. సమంత లీడ్ రోల్ లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రన్ తీసుకుంది.

By:  M Prashanth   |   25 Aug 2026 10:00 PM IST
అంత పెద్ద హిట్ తర్వాత.. నందిని మళ్లీ వెబ్ సిరీస్‌కేనా?
X

‘మా ఇంటి బంగారం’తో నందిని రెడ్డికి చాలా రోజుల తర్వాత పెద్ద హిట్ దక్కింది. సమంత లీడ్ రోల్ లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రన్ తీసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే చాలా పెద్ద నంబర్స్ అందుకుంది. అలాంటి హిట్ తర్వాత నందిని నెక్స్ట్ ఏ స్టార్‌తో సినిమా చేస్తుందా అన్న లెక్కలు మొదలయ్యాయి. కానీ ఆమె మాత్రం వెంటనే మరో థియేట్రికల్ సినిమా వైపు వెళ్లకుండా వేరే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ కోసం నందిని ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు సమాచారం. అది కూడా ఆమె ఇప్పటివరకు ఎక్కువగా టచ్ చేయని సూపర్‌నేచురల్ థ్రిల్లర్ జానర్‌లో ఉండనుందట. ఈ ప్రాజెక్ట్‌లో త్రిష ప్రధాన పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నా, ఈ కాంబినేషన్ మాత్రం ఇప్పుడు బలంగానే వినిపిస్తోంది.

నిజానికి నందినికి వెబ్ కంటెంట్ కొత్త కాదు. గతంలో ‘గ్యాంగ్‌స్టార్స్’తో ఓటీటీ వైపు పని చేసింది. ‘పిట్ట కథలు’లో కూడా ఒక భాగాన్ని డైరెక్ట్ చేసింది. కానీ అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’లాంటి హిట్ చేతిలో ఉన్న సమయంలో మళ్లీ వెబ్ సిరీస్ ఎంచుకోవడం మామూలు విషయం కాదు.

పైగా కథ కూడా ఆమె రెగ్యులర్ జోన్‌కు పూర్తి భిన్నంగా ఉందట. ‘అలా మొదలైంది’, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’, ‘మా ఇంటి బంగారం’ వరకు నందిని సినిమాల్లో రిలేషన్‌షిప్స్, ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ ఎక్కువగా కనిపించాయి. ఇప్పుడు ఒక్కసారిగా సూపర్‌నేచురల్ థ్రిల్లర్ అంటే ఆమె కూడా కొత్తగా ట్రై చేస్తున్నట్లే. ఈ కథపై చాలాకాలంగా పని చేస్తున్నట్లు సమాచారం.

త్రిష వస్తే ఆమెకు కూడా ఇది మరో వెబ్ సిరీస్ అవుతుంది. ఇప్పటికే ‘బృంద’తో ఓటీటీలో వర్క్ చేస్తోంది. థ్రిల్లర్ కథలు కూడా ఆమెకు కొత్త కాదు. ఈ న్యూ కాంబో కలిస్తే ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ సిరీస్‌లా కాకుండా కాస్త పెద్ద స్థాయిలో ప్లాన్ చేసే అవకాశం ఉంది. అయితే పూర్తి వివరాలు అధికారికంగా బయటకు వచ్చిన తర్వాతే అసలు సెటప్ తెలుస్తుంది.

ఇక నందిని దగ్గర ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక పెద్ద హిట్ వచ్చిన వెంటనే అదే తరహాలో మరో ఫ్యామిలీ సినిమా చేసి సేఫ్‌గా వెళ్లొచ్చు. కానీ మధ్యలో జానర్ మార్చి వెబ్ సిరీస్ చేస్తే, తర్వాత ఆమెకు వచ్చే కథల రేంజ్ కూడా మారొచ్చు. అయితే ఆమె నుంచి ఒక బిగ్ స్టార్ సినిమా కూడా రావాలని కోరుకుంటున్నారు. నాని తరువాత మళ్ళీ మరో స్థాయి హీరోతో వర్క్ చేయలేదు. మరి ఫ్యూచర్ లో అంతకుమించిన పెద్ద సినిమాల్లో ఏమైనా అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.