సమంతతో పని చేయడం అంత ఈజీ కాదంటున్న డైరెక్టర్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చాలా గ్యాప్ తర్వాత పూర్తి స్థాయి తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా మా ఇంటి బంగారం.
By: Sravani Lakshmi Srungarapu | 26 May 2026 11:28 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చాలా గ్యాప్ తర్వాత పూర్తి స్థాయి తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా మా ఇంటి బంగారం. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్స్‌ను స్పెషల్ ఎమోషన్స్ తో తెరకెక్కించే డైరెక్టర్ నందినీ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తుండగా, సినిమా కథను సమంత భర్ రాజ్ నిడిమోరు అందించడం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఈ సినిమాను ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత స్వయంగా నిర్మిస్తుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్, ప్రోమో మెటీరియల్ సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చాయి. వాస్తవానికి ఈ సినిమా చాలా కాలం క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా, ప్రొడక్షన్ మరియు షెడ్యూలింగ్ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.
ఇటీవల నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ నందినీ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సమంత గురించి మాట్లాడిన నందినీ రెడ్డి, నేను సమంతకు పెద్ద అభిమానిని. ఆమెను కన్విన్స్ చేయడం చాలా కష్టం. అది ఒక సీన్ అయినా, స్క్రిప్ట్ అయినా, డైలాగ్ అయినా సరే, ఆమె అడిగే ప్రతి ప్రశ్నకు క్లారిటీగా సమాధానం చెప్పాలి. దర్శకుడు తన గేమ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు.
సమంత వర్క్ పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటుందో, ఒక పాత్రను ఎంత లోతుగా అర్థం చేసుకుని చేస్తుందో ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. ఇక తమ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా అని గుర్తుచేసిన నందినీ రెడ్డి, సమంత యాక్టింగ్ పై ప్రశంసల వర్షం కురిపించింది. యాక్షన్, కామెడీ, ఎమోషనల్ సీన్… ఏది చేసినా ప్రేక్షకులను ఆశ్చర్యపరచే స్థాయిలో సమంత పెర్ఫార్మ్ చేస్తుంది. ఆమెకు సాధ్యం కానిది ఏదీ లేదంటూ ఆమెను ఆకాశానికెత్తేసింది. ఈ వ్యాఖ్యలు వినిపించిన వెంటనే సోషల్ మీడియాలో సమంత ఫ్యాన్స్ భారీగా షేర్ చేస్తున్నారు. చాలా మంది సినిమా పటల సమంతకు ఉన్న డెడికేషన్‌కు ఇదే నిదర్శనమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో సమంత పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు చేయని తరహా ఎమోషనల్ షేడ్స్ ఈ సినిమాలో కనిపిస్తాయని సమాచారం. డైరెక్టర్ నందినీ రెడ్డి మరియు సమంత మధ్య ఉన్న మంచి అండర్‌స్టాండింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ ను చూస్తుంటే, మా ఇంటి బంగారం కేవలం ఓ కంబ్యాక్ మూవీ మాత్రమే కాకుండా సమంత కెరీర్‌లో మరో స్పెషల్ మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
