సామ్ తో హిట్టు కొట్టినా పెద్ద స్టార్ దొరకడం లేదా?
తెలుగు సినిమాలో ఎస్టాబ్లిష్ అయిన ఫీమేల్ డైరెక్టర్ల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువే. ఇలాంటి వాతావరణంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందిని రెడ్డి.
By: M Prashanth | 11 Aug 2026 11:00 PM ISTతెలుగు సినిమాలో ఎస్టాబ్లిష్ అయిన ఫీమేల్ డైరెక్టర్ల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువే. ఇలాంటి వాతావరణంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందిని రెడ్డి. ముఖ్యంగా సమంతతో ఆమెకు మంచి వర్కింగ్ ఈక్వేషన్ ఉంది. రీసెంట్ గా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'మా ఇంటి బంగారం' మంచి రిజల్ట్ రాబట్టింది. ఆ హిట్ తర్వాత సహజంగానే థియేట్రికల్ కంటెంట్ పరంగా ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.
ఆమె కెరీర్ గ్రాఫ్ చూస్తే మొదట్నుంచీ థియేట్రికల్ సినిమాలతో తనకంటూ ఒక స్పెషల్ ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నారు. అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ, అన్నీ మంచి శకునములే, మా ఇంటి బంగారం లాంటి విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చారు. ఒక హిట్ తర్వాత వెంటనే మరో పెద్ద స్టార్ తో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వస్తుందని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయడం కామన్.
కానీ ఇండస్ట్రీ రియాలిటీ కొంచెం వేరుగా ఉంటుంది. పెద్ద స్టార్ల డేట్స్, డైరెక్టర్ల కాంబినేషన్స్, మార్కెట్ లెక్కలు సెట్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లకు కూడా ఒక స్టార్ తో ప్రాజెక్ట్ లాక్ అవ్వడం అనేది ఈ రోజుల్లో పెద్ద ప్రాసెస్. సరైన థియేట్రికల్ స్క్రిప్ట్ తో స్టార్స్ ని అప్రోచ్ అవ్వడానికి తగిన సమయం తీసుకోవాల్సిందే.
సరిగ్గా ఈ టైమ్ లోనే, ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఓటీటీ కోసం ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే స్టార్స్ ఆమెను అవాయిడ్ చేస్తున్నారని, థియేట్రికల్ అవకాశాలు లేకపోవడం వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారని నెగిటివ్ గా అనుకోలేం. ఇది కేవలం ఆమె ఫార్మాట్ ఛాయిస్ కావచ్చు, టైమింగ్ కుదిరి ఉండొచ్చు, లేదా సరైన థియేట్రికల్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తూ ఈ గ్యాప్ లో సిరీస్ ప్లాన్ చేసి ఉండొచ్చు. పైగా ఆమెకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమీ కొత్త కాదు. 2018లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ల కోసం వచ్చిన 'గ్యాంగ్ స్టార్స్' సిరీస్ కు ఆమె క్రియేటర్ గా పనిచేశారు.
2021లో నెట్ఫ్లిక్స్ 'పిట్ట కథలు' ఆంథాలజీలో 'మీరా' సెగ్మెంట్ ను డైరెక్ట్ చేశారు. అందుకే ఇప్పుడు మళ్ళీ సిరీస్ వైపు వెళ్లడం ఆమెకు తెలిసిన స్పేస్ లో వర్క్ చేయడమే అవుతుంది. మా ఇంటి బంగారం లాంటి హిట్ తర్వాత వెంటనే పెద్ద స్టార్ సినిమా అనౌన్స్ కాలేదనే కారణంతో నందిని రెడ్డి డిమాండ్ తగ్గిందని చెప్పడం తొందరపాటే అవుతుంది. అయితే తెలుగు సినిమాలో ఒక సక్సెస్ ఫుల్ ఫీమేల్ డైరెక్టర్ కి నెక్స్ట్ బిగ్ థియేట్రికల్ ఆపర్చునిటీ ఎంత త్వరగా వస్తుందన్న ప్రశ్న మాత్రం అందరిలో ఉంది.
