Begin typing your search above and press return to search.

MSGలో ఫేమస్ యూట్యూబర్.. ఆ ఎపిసోడ్ కు నవ్వులే నవ్వులు!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   12 Jan 2026 1:47 PM IST
MSGలో ఫేమస్ యూట్యూబర్.. ఆ ఎపిసోడ్ కు నవ్వులే నవ్వులు!
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమా.. సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 12వ తేదీన) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైంది. నిన్న రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ తో మూవీ సందడి మొదలైంది.

అయితే సినిమా చూసిన వారంతా ఇప్పుడు సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తున్నారు. ఆ సమయంలో సినిమాలోని ఓ సీన్ కోసం ఇప్పుడు తెగ చర్చ నడుస్తోంది. అదే ఫేమస్ యూట్యూబర్ నందన యాక్ట్ చేసిన ఎపిసోడ్. నయనతార ఫ్రెండ్ గా కనిపించిన ఆమె.. యాక్టింగ్ తో అదరగొట్టేశారని అంతా కామెంట్లు పెడుతున్నారు. బాగా నటించారని చెబుతున్నారు. ముఖ్యంగా ఆ ఎపిసోడ్ సూపర్ అని అంటున్నారు.

సినిమాలో నయన్.. తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్లిన ఆ సీన్ అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో నందన యాక్టింగ్, డైలాగ్ టైమింగ్.. మరింత మెప్పిస్తోంది. అయితే యూకేలో ఉండే నందన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో టాప్ యూట్యూబర్స్ లో ఒకరిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. తన చలాకి మాటలతో 2.7 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు దక్కించుకున్నారు.

అయితే గతంలో సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ చూసి పలు సినిమా అవకాశాలు వస్తున్నాయని పలుమార్లు తెలిపారు నందన. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీలో యాక్ట్ చేశారు. ఆ సినిమాకు సంబంధించిన యూకే ప్రమోషన్లలో కూడా ఆమె చురుగ్గా పాల్గొన్నట్లు తెలుస్తోంది. సినిమాలో యాక్ట్ చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చినా.. ఎక్కడ కూడా ఆమె అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు స్క్రీన్ పై కనిపించి మెప్పించారు.

నందూస్ వరల్డ్ ఛానెల్ లో నందన ఫ్యాషన్, జ్యువెలరీ కలెక్షన్లు, షాపింగ్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ తో సందడి చేస్తుంటారు. ఆమె వీడియోలు ఎక్కువగా కుటుంబ విలువలు, మధ్యతరగతి సరదాలతో ఉంటాయి. తన భర్త, ఇద్దరి పిల్లలతో ఫన్నీ వీడియోలు చేస్తూ అలరిస్తుంటారు. అయితే ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీలో నటించిన నందన.. మరిన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తారో లేదో వేచి చూడాలి.

ఇక మన శంకర వరప్రసాద్ గారు మూవీ విషయానికొస్తే, చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించారు. సీనియర్ నటుడు వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. కేథరిన్‌, హర్షవర్ధన్‌, అభినవ్‌ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్ అందించగా.. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు.