Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

నందమూరి మోక్షజ్ఞ హీరోగా వశిష్ట దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సినిమా డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయని, సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వశిష్ట చిరంజీవి ‘విశ్వంభర’ పనులు పూర్తి చేసే దశలో ఉన్నారు.

By:  Ramesh Palla   |   13 Nov 2026 11:00 PM IST
మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!
X

నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ అంటూ చాలా కాలంగా మీడియాలో వార్తలు చూస్తూనే ఉన్నాం. దాదాపు పదేళ్ల క్రితం బాలకృష్ణ ఒక సినిమా ప్రమోషన్‌ కార్యక్రమం సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య మోక్షజ్ఞ లుక్‌ విషయంలో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో విమర్శలు చేసిన వారే ఇప్పుడు మోక్షజ్ఞను చూసి వావ్‌ అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. ఆ స్థాయిలో చేంజ్‌ అయిన మోక్షజ్ఞ ఇక సింహం మాదిరిగా దూకుతాడని ఫ్యాన్స్‌ భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ప్రశాంత్‌ వర్మ రూపంలో ఒక పెద్ద షాక్‌ తగిలింది. మోక్షజ్ఞ బర్త్‌ డే సందర్భంగా రెండేళ్ల క్రితం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో సినిమా అంటూ ప్రకటన వచ్చింది, అంతే కాకుండా మోక్షజ్ఞ పోస్టర్స్ సైతం విడుదల చేశారు.

మోక్షజ్ఞ, ప్రశాంత్‌ వర్మ మూవీ....

కట్‌ చేస్తే మోక్షజ్ఞతో ప్రశాంత్‌ వర్మ సినిమా ఆగిపోయింది. అందుకు కారణాలు ఏంటీ అనే విషయంలో క్లారిటీ లేదు. మోక్షజ్ఞ స్థాయికి ప్రశాంత్‌ వర్మ స్క్రిప్ట్‌ రెడీ చేయలేక పోయాడేమో, అందుకే ఆయన్ను బాలకృష్ణ తప్పించాడు అంటూ ఫ్యాన్స్ లో చర్చ నడిచింది. మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రకటన వచ్చిన తర్వాత ఇలా జరిగింది ఏంటో అని ఫ్యాన్స్‌ చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మోక్షజ్ఞ కచ్చితంగా తన స్థాయికి తగ్గట్లుగా ఒక సాలిడ్‌ సినిమాతో వస్తాడని మాత్రం ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఏడాది ఎదురు చూపుల తర్వాత మోక్షజ్ఞ సినిమా గురించిన ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నందమూరి మోక్షజ్ఞ హీరోగా వశిష్ట దర్శకత్వంలో సినిమా ప్రకటన వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం నిర్మాణ సంస్థ విడుదల చేయడం ద్వారా ఇక సినిమా మొదలు అని అంతా అనుకున్నారు.

బింబిసార దర్శకుడు వశిష్ట...

వశిష్ట బింబిసార సినిమాతో ఒక్కసారిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. చాలా మంది యంగ్‌ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించాలని ఆశ పడ్డారు. ఈతరం దర్శకుల్లో ఇంత మంచిగా సోషియో ఫాంటసీ సినిమా తీయడం నీకే సాధ్యం అని చాలా మంది హీరోలు ఆయనతో అన్నారని సమాచారం. అందుకే మెగాస్టార్‌ చిరంజీవితో విశ్వంభర సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. దురదృష్టం వెంటాడటంతో విశ్వంభర సినిమా చాలా ఆలస్యం అయింది. మూడు ఏళ్లుగా అదుగో, ఇదుగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న విషయం తెల్సిందే. విశ్వంభర సినిమా విడుదల అయితే తప్ప మోక్షజ్ఞతో సినిమాను వశిష్ట మొదలు పెట్టే పరిస్థితి లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. కానీ మైత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్‌ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మోక్షజ్ఞ, వశిష్ట, మైత్రి మూవీ మేకర్స్‌ కాంబో...

విశ్వంభర సినిమాను పూర్తి చేసి ప్రస్తుతం డబ్బింగ్‌ వర్క్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మద్య విశ్వంభర సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తాజాగా డబ్బింగ్‌ పనులు జరుగుతున్నట్లు క్లారిటీ వచ్చింది. అందుకే విశ్వంభర పని పూర్తి చేసి, కాపీ రెడీ చేసి నిర్మాతలకు అప్పగించి, ఆ సినిమా నుంచి వశిష్ట బయట పడే అవకాశం ఉంది. అంటే ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో సినిమా రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక మోక్షజ్ఞ సినిమాను అప్పుడు వెంటనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి చేశారని, బాలకృష్ణ మెచ్చిన ఒక మంచి సోషియో ఫాంటసీ కథాంశం ను వశిష్ట రెడీ చేశారని తెలుస్తోంది. బింబిసార తరహాలో విభిన్నమైన సినిమాను మోక్షజ్ఞకు వశిష్ట అందిస్తాడని నందమూరి ఫ్యామిలీ నమ్మకంగా ఉంది. కానీ పాపం సినిమా మొదలు కావడమే ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. నందమూరి ఫ్యాన్స్‌ మోక్షజ్ఞ సినిమా విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, పాపం ఎందుకు మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని ఇబ్బందులు అని బాధ పడుతున్నారు.